News30th May 05:01 PMSunil Byrisetty1 min read
మే 31న ఎన్‌టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ
జూన్ 1వ తేదీ ఆదివారం కావడంతో ఈ నెల 31వ తేదీనే ఎన్‌టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ చేపట్టడం జరుగుతుందని.. పేదల సేవలో స్ఫూర్తికి అనుగుణంగా పెన్షన్లను పంపిణీ చేయాలని జిల్లా కలె
జూన్ 1వ తేదీ ఆదివారం కావడంతో ఈ నెల 31వ తేదీనే ఎన్‌టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ చేపట్టడం జరుగుతుందని.. పేదల సేవలో స్ఫూర్తికి అనుగుణంగా పెన్షన్లను పంపిణీ చేయాలని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ అధికారులను ఆదేశించారు. జిల్లాలో మే 31న చేపట్టే ఎన్‌టీఆర్ భరోసా పెన్షన్ల కింద 2,27,786 పెన్షన్లకు దాదాపు రూ. 98.11 కోట్లు పంపిణీ చేయడం జరుగుతుందని.. క్షేత్రస్థాయిలో అధికారులు సమన్వయంతో పనిచేసి ఇళ్ల వద్ద పెన్షన్ల పంపిణీ సజావుగా సాగేలా కృషిచేయాలన్నారు. డీఆర్‌డీఏ పీడీ, ఆర్‌డీవోలు, మునిసిపల్ కమిషనర్లు, ఎంపీడీవోలతో ఎన్‌టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీపై కలెక్టర్ లక్ష్మీశ టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎక్కడా ఎలాంటి లోటుపాట్లు లేకుండా పెన్షన్ల పంపిణీ జరిగేలా చూడాలన్నారు. పంపిణీ సమయంలో ఇబ్బంది లేకుండా ఉండేందుకు పెన్షన్ రకాన్నిబట్టి నగదు మొత్తాన్ని బండిల్‌గా సిద్ధం చేసుకోవాలన్నారు. ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా ఉండేందుకు నియోజకవర్గ, మండల ప్రత్యేక అధికారులు, ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లు పంపిణీ ప్రక్రియను పర్యవేక్షించాలని కలెక్టర్ లక్ష్మీశ సూచించారు.