News30th Oct 12:17 PMSunil Byrisetty1 min read

పోలవరం జిల్లాలో పింఛన్ల పంపిణీ

పోలవరం జిల్లావ్యాప్తంగా అక్టోబర్ 30వ తేదీన 46,211 మంది లబ్ధిదారులకు మొత్తం రూ.19,37,16,500 (రూ.19.37 కోట్లు) మేర ఎన్టీఆర్ భరోసా పింఛన్ల నగదును పంపిణీ చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్

పోలవరం జిల్లాలో పింఛన్ల పంపిణీ
పోలవరం జిల్లావ్యాప్తంగా అక్టోబర్ 30వ తేదీన 46,211 మంది లబ్ధిదారులకు మొత్తం రూ.19,37,16,500 (రూ.19.37 కోట్లు) మేర ఎన్టీఆర్ భరోసా పింఛన్ల నగదును పంపిణీ చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ కె. దినేష్ కుమార్ తెలిపారు. జిల్లాలోని అన్ని మండలాల్లో అర్హులైన లబ్ధిదారులకు పింఛన్ల సొమ్ము పంపిణీ ప్రక్రియ చేపట్టినట్లు వెల్లడించారు. లబ్ధిదారులతో మాట్లాడి పింఛన్ల పంపిణీ జరుగుతున్న తీరును, నగదు అందిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. జిల్లావ్యాప్తంగా అర్హులైన ప్రతి ఒక్కరికీ నిర్ణీత మార్గదర్శకాల ప్రకారం పింఛను అందేలా సంబంధిత అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని సూచించారు.స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి, రాష్ట్ర ఎన్నికల సంఘం జారీ చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా పింఛన్ల పంపిణీ ప్రక్రియ నిర్వహించాలని కలెక్టర్ తెలిపారు. సంబంధిత అధికారులకు, సిబ్బందికి ఇప్పటికే అవసరమైన ఆదేశాలు జారీ చేసినట్లు వెల్లడించారు.
Scroll for the next article