News31st Dec 12:40 PMSunil Byrisetty1 min read
పింఛను.. సరికొత్తగా చేతికందెను!
పేదలకు ఎన్‌టీఆర్ భరోసా ద్వారా సామాజిక భద్రతతోపాటు గౌరవప్రద జీవితానికి భరోసా ఏర్పడుతోందని.. పేదల సేవలో మరో ముందడుగుతో ఎన్‌టీఆర్ భరోసా పెన్షన్ మొత్తం నూతన ఏడాది ప్రా
పేదలకు ఎన్‌టీఆర్ భరోసా ద్వారా సామాజిక భద్రతతోపాటు గౌరవప్రద జీవితానికి భరోసా ఏర్పడుతోందని.. పేదల సేవలో మరో ముందడుగుతో ఎన్‌టీఆర్ భరోసా పెన్షన్ మొత్తం నూతన ఏడాది ప్రారంభం నాటికే లబ్ధిదారుల చేతికందిందని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ అన్నారు. ఎన్‌టీఆర్ భరోసా ద్వారా సామాజిక భద్రత పెన్షన్ల పంపిణీలో భాగంగా బుధవారం అధికారులతో కలిసి లెనిన్ సెంటర్ ప్రాంతంలో లబ్ధిదారులకు పెన్షన్ పంపిణీ చేసే కార్యక్రమంలో పాల్గొన్నారు. వార్డు సచివాలయ కార్యదర్శులు, ప్రభుత్వ ఉద్యోగుల ద్వారా ఇంటింటికి వెళ్లి పెన్షన్లు అందిస్తున్న ప్రక్రియను పరిశీలించారు. నూతన సంవత్సరం ప్రారంభం నాటికే లబ్ధిదారులకు పెన్షన్ మొత్తం అందించాలనే ఉద్దేశంతో డిసెంబర్ 31నే పంపిణీకి ప్రభుత్వం ఏర్పాట్లు చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగిందన్నారు. జిల్లాలో ఎన్‌టీఆర్ భరోసా పెన్షన్ల కింద కొత్త వాటితో కలుపుకొని 2,28,592 పెన్షన్లకు దాదాపు రూ. 98.95 కోట్లు పంపిణీ చేయడం జరుగుతోందని.. క్షేత్రస్థాయిలో అధికారులు సమన్వయంతో పనిచేసి ఇళ్ల వద్ద పెన్షన్ల పంపిణీ సజావుగా సాగేలా కృషిచేశారన్నారు.