News28th Jan 12:44 PMSunil Byrisetty1 min read

జనవరి 31నే పెన్షన్ల పంపిణీ

ఎన్టీఆర్ భరోసా పెన్షన్లపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఫిబ్రవరి 1న పంపిణీ చేయాల్సిన పెన్షన్లను ఒకరోజు ముందుగా అంటే జనవరి 31నే పంపిణీ చేయాలని నిర్ణయించింది. దీంతో అధికారులు ఆ మ

జనవరి 31నే పెన్షన్ల పంపిణీ
ఎన్టీఆర్ భరోసా పెన్షన్లపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఫిబ్రవరి 1న పంపిణీ చేయాల్సిన పెన్షన్లను ఒకరోజు ముందుగా అంటే జనవరి 31నే పంపిణీ చేయాలని నిర్ణయించింది. దీంతో అధికారులు ఆ మేరకు సచివాలయాలకు పెన్షన్ల నగదు మొత్తాన్ని జనవరి 30నే పంపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం వార్షిక బడ్జెట్ ను ఫిబ్రవరి 1న అసెంబ్లీలో ప్రవేశపెట్టబోతోంది. ఆ రోజు ఆదివారం వచ్చింది. అయినా బడ్జెట్ ను ప్రవేశపెట్టేందుకు ఏర్పాట్లు చేస్తోంది. అదే సమయంలో సచివాలయ ఉద్యోగులతో ఆదివారం పెన్షన్ల పంపిణీ పని చేయించాల్సి ఉంటుంది. అందుకే ఒక్క రోజు ముందు అంటే జనవరి 31నే పెన్షన్లను లబ్దిదారులకు అందించాలని నిర్ణయించడంతో పాటు అధికారులకు ఆదేశాలు పంపుతోంది.
Andhra Pradesh Government
NTR Bharosa Pension
AP Pensions
Pension Distribution
January 31 Pensions
బడ్జెట్ సమావేశం
సచివాలయ వ్యవస్థ
లబ్ధిదారులు
Scroll for the next article