News8th Sep 04:09 PMSunil Byrisetty1 min read
శత శాతం అక్షరాస్యతే ధ్యేయం
శత శాతం అక్షరాస్యత సాధించిన జిల్లాగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా యంత్రాంగం, విద్యాశాఖ, సంబంధిత శాఖలు సమన్వయంతో కృషి చేస్తున్నాయని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీ శ తెలిపారు. జిల్లా వ
శత శాతం అక్షరాస్యత సాధించిన జిల్లాగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా యంత్రాంగం, విద్యాశాఖ, సంబంధిత శాఖలు సమన్వయంతో కృషి చేస్తున్నాయని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీ శ తెలిపారు. జిల్లా వయోజన విద్యాశాఖ ఆధ్వర్యంలో విజయవాడ కె.బి.ఎన్. కళాశాలలో 60వ అంతర్జాతీయ అక్షరాస్యతా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. అక్షరాస్యత అనేది కేవలం చదవడం, రాయడం నేర్చుకోవడమే కాకుండా వ్యక్తి సామాజిక, ఆర్థిక, సాంకేతిక అభివృద్ధికి కీలకమైన సాధనమని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరికీ అక్షరాస్యత అందేలా ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందన్నారు. ‘అక్షరాంధ్ర’ కార్యక్రమంలో భాగంగా 2025–26 సంవత్సరానికి 97,047 మందిని అక్షరాస్యులుగా తీర్చిదిద్దే లక్ష్యాన్ని నిర్దేశించగా, 96,686 మందిని అక్షరాస్యులుగా తీర్చిదిద్ది 99 శాతం అక్షరాస్యతను సాధించినట్లు కలెక్టర్ వెల్లడించారు. 2026–27 సంవత్సరానికి సంబంధించి 88,890 మంది నమోదు లక్ష్యాన్ని పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు. మిగిలిన వారిని కూడా అక్షరాస్యులుగా తీర్చిదిద్ది జిల్లాను శతశాతం అక్షరాస్యత దిశగా తీసుకెళ్లేందుకు నిరంతర కృషి కొనసాగుతుందని పేర్కొన్నారు.