News21st Oct 04:41 PMSunil Byrisetty1 min read
సరస్ మేళాకు సోషల్ మీడియా విస్తృత ప్రచారం
విజయవాడలోని పున్నమి ఘాట్ వేదికగా నిర్వహిస్తున్న జాతీయ స్థాయి నేషనల్ సరస్ మేళా–2026 కు సోషల్ మీడియా ద్వారా విస్తృత ప్రచారం కల్పించి, స్వయం సహాయక సంఘాల మహిళలు తయారు చేసిన ఉత్పత్తుల వ
విజయవాడలోని పున్నమి ఘాట్ వేదికగా నిర్వహిస్తున్న జాతీయ స్థాయి నేషనల్ సరస్ మేళా–2026 కు సోషల్ మీడియా ద్వారా విస్తృత ప్రచారం కల్పించి, స్వయం సహాయక సంఘాల మహిళలు తయారు చేసిన ఉత్పత్తుల విక్రయాలు పెరిగేలా సహకరించాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు, కంటెంట్ క్రియేటర్లకు పిలుపునిచ్చారు. బుధవారం పున్నమి ఘాట్‌లోని సరస్ మేళా ప్రాంగణంలో ప్రముఖ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు, కంటెంట్ క్రియేటర్లతో జిల్లా కలెక్టర్ ప్రత్యేక సమావేశం సరస్ మేళా లో నిర్వహించారు. ఈ సందర్భంగా మేళా నిర్వహణ ఉద్దేశం, మహిళా సంఘాల ఉత్పత్తుల ప్రత్యేకతలు, డిజిటల్ మాధ్యమాల ద్వారా వాటికి విస్తృత ప్రచారం కల్పించాల్సిన ఆవశ్యకతను వారికి వివరించారు. సరస్ మేళా లో ప్రత్యేక ఆకర్షణగా వెల్కమ్ రోబో నిలవనున్నదన్నారు. గ్రామీణ ప్రాంతాలకు చెందిన స్వయం సహాయక సంఘాల మహిళల్లో దాగి ఉన్న నైపుణ్యాలను వెలికితీయడంతో పాటు, వారు తయారు చేస్తున్న ఉత్పత్తులకు జాతీయ స్థాయిలో మార్కెటింగ్ అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం సరస్ మేళాను ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోందన్నారు.