News24th Jul 04:16 PMSunil Byrisetty1 min read
విద్యార్థులతో కలిసి భోజనం చేసిన కలెక్టర్
రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టితో పాఠశాలల్లో నాణ్యమైన విద్యతో పాటు మౌలిక వసతులు, మధ్యాహ్న భోజనం పరంగా మెరుగైన మార్పులు చేయడంతో ప్రవేశాలు పెరిగాయని ఎన్టీఆర్ జిల్లా క
రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టితో పాఠశాలల్లో నాణ్యమైన విద్యతో పాటు మౌలిక వసతులు, మధ్యాహ్న భోజనం పరంగా మెరుగైన మార్పులు చేయడంతో ప్రవేశాలు పెరిగాయని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ విద్యార్థులకు సూచించారు. విజయవాడ కృష్ణలంకలోని అమరజీవి పొట్టి శ్రీరాములు నగరపాలక సంస్థ ఉన్నతపాఠశాలను కలెక్టర్ లక్ష్మీశ మధ్యాహ్న భోజన సమయంలో ఆకస్మిక తనిఖీ చేశారు. మెనూ ప్రకారం ఆహారాన్ని అందిస్తున్నారా.. లేదా? ఆహారం నాణ్యత ఎలా ఎంది? వంటి విషయాలను పరిశీలించారు. చిన్నారులతో మాట్లాడి భోజనం ఎలా ఉందో అడిగి తెలుసుకున్నారు. పాఠశాలలో 370 మంది విద్యార్థులుండగా అందరూ పాఠశాలలోనే మధ్యాహ్న భోజనం చేస్తున్నట్లు తెలుసుకొని ఆనందం వ్యక్తం చేశారు. విద్యార్థులతో ముచ్చటిస్తూ కలెక్టర్ అక్కడే భోజనం చేశారు.