News1st Nov 02:34 PMSunil Byrisetty1 min read

ఎన్నికల నిర్వహణ తీరు పరిశీలన

ఎన్టీఆర్ జిల్లా ఎన్నికల వ్యయ పరిశీలకులు బి.విజయకుమార్ విజయవాడ పీబీ సిద్ధార్థ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా పోలింగ్ ప్రక్ర

ఎన్నికల నిర్వహణ తీరు పరిశీలన
ఎన్టీఆర్ జిల్లా ఎన్నికల వ్యయ పరిశీలకులు బి.విజయకుమార్ విజయవాడ పీబీ సిద్ధార్థ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా పోలింగ్ ప్రక్రియ కొనసాగుతున్న తీరును, ఓటర్ల భాగస్వామ్యాన్ని, పోలింగ్ కేంద్రంలో ఎన్నికల సిబ్బంది విధుల నిర్వహణను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.ఓటర్లు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు కల్పించిన మౌలిక సదుపాయాలు, తాగునీరు, క్యూలైన్ల నిర్వహణ, భద్రతా ఏర్పాట్లను సమీక్షించారు. ఎన్నికల విధుల్లో ఉన్న సిబ్బందితో మాట్లాడి పోలింగ్ నిర్వహణకు సంబంధించిన వివరాలను తెలుసుకున్నారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి, వ్యయ పర్యవేక్షణ నిబంధనలు పక్కాగా అమలయ్యేలా చూడాలని, ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత, నిష్పక్షపాత వైఖరిని పాటిస్తూ విధులు నిర్వహించాలని సంబంధిత అధికారులకు సూచించారు. ప్రశాంత వాతావరణంలో పోలింగ్ ప్రక్రియ సజావుగా పూర్తయ్యేలా నిరంతరం అప్రమత్తంగా ఉండాలన్నారు.
Scroll for the next article