News16th Jul 04:21 PMSunil Byrisetty1 min read

ప్రతి ఫ్రేమ్ ఒక జ్ఞాపకం..

ఫొటోగ్ర‌ఫీలో విశేష ప్ర‌తిభ‌క‌న‌బ‌రిచిన ఫొటోగ్రాఫ‌ర్ల‌కు ఆగస్ట్ 19న ప్ర‌పంచ ఫొటోగ్ర‌ఫీ దినోత్స‌వం సంద‌ర్భంగా జిల్లాస్థాయిలో పుర‌స్కారాలు ప్ర‌దానం చేయ‌నున్న‌ట్లు జిల్లా క‌లెక్ట‌ర్ డా

ప్రతి ఫ్రేమ్ ఒక జ్ఞాపకం..
ఫొటోగ్ర‌ఫీలో విశేష ప్ర‌తిభ‌క‌న‌బ‌రిచిన ఫొటోగ్రాఫ‌ర్ల‌కు ఆగస్ట్ 19న ప్ర‌పంచ ఫొటోగ్ర‌ఫీ దినోత్స‌వం సంద‌ర్భంగా జిల్లాస్థాయిలో పుర‌స్కారాలు ప్ర‌దానం చేయ‌నున్న‌ట్లు జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ తెలిపారు. ఎన్‌టీఆర్ జిల్లా ప‌రిధిలోని ఫోటో జర్నలిస్టులు, ఔత్సాహిక ఫోటోగ్రాఫర్లు, స్టూడియో ఫొటోగ్రాఫ‌ర్లు పోటీల్లో పాల్గొనవచ్చున‌ని.. ఫొటోగ్రాఫ‌ర్లు ఆగస్టు 5వ తేదీలోగా త‌మ ఎంట్రీలు పంపాల్సి ఉంటుంద‌న్నారు. మొద‌టి విభాగంలో జిల్లాకు సంబంధించి ఆంధ్ర‌ప్ర‌దేశ్ వార‌స‌త్వం, ప‌ర్యాట‌కం, సంస్కృతి అంశాల్లో ఫొటో ఎంట్రీలు పంపొచ్చ‌న్నారు. రెండో విభాగంలో యువ‌త‌, పీ4, ఆర్థికాభివృద్ధి-సంక్షేమం అంశాలు, మూడో విభాగంలో అత్యుత్త‌మ న్యూస్ ఫొటో పోటీ ఉంటుంద‌న్నారు. ప్ర‌తి విభాగంలో ప్ర‌థ‌మ బహుమతి గా రూ. 10 వేలు,ద్వితీయ బహుమతి కింద రూ. 7 వేలు తృతీయ బహుమతి గా రూ. 4 వేలు నగదు బ‌హుమ‌తుల‌తో పాటు రూ. 2 వేలు చొప్పున ఆరుగురికి ప్రోత్సాహ‌క నగదు బ‌హుమ‌తులు అందించ‌నున్న‌ట్లు వివ‌రించారు. 2025, జూన్ 12 నుంచి 2026, జులై 31 మ‌ధ్య తీసిన ఫొటోలై ఉండాల‌ని.. ఫొటో సైజు 12X10 ఉండాల‌ని, ఫొటోలు ఎన్‌టీఆర్ జిల్లాలో మాత్ర‌మే తీసి, ప‌బ్లిసిటీకి మాత్ర‌మే ఉప‌యోగించేవిగా ఉండాల‌ని వివ‌రించారు. ఒరిజిన‌ల్ ఫొటో ఎంట్రీల‌ను డీపీఆర్‌వో కార్యాల‌యం, స్టేట్ గెస్ట్ హౌస్‌, విజ‌య‌వాడ‌-520002 చిరునామాకు నేరుగా లేదా పోస్ట‌ల్ ద్వారా స‌మ‌ర్పించ‌వచ్చన్నారు. ఇతర వివరాలకు కె.రవి, డివిజ‌న‌ల్ పీఆర్‌వో (9010156550)ను సంప్రదించాలని కలెక్టర్ సూచించారు.
Andhra Pradesh
World Photography Day
Photography Contest
NTR District
Photojournalism
Photographers
ఫోటోగ్రఫీ అవార్డులు
ఫోటో పోటీ
వారసత్వం
పర్యాటకం
సంస్కృతి
Scroll for the next article