News12th Aug 04:31 PMSunil Byrisetty1 min read

గంజాయి రహితంగా ఎన్టీఆర్ జిల్లా

ఎన్టీఆర్ జిల్లాను గంజాయి రహిత జిల్లాగా తీర్చిదిద్దడంలో జిల్లా యంత్రాంగం, పోలీస్ శాఖ, వివిధ ప్రభుత్వ శాఖలు, స్వచ్ఛంద సంస్థలు సమన్వయంతో కృషి చేసి ఫలితాలను సాధించామని ఎన్టీఆర్ జిల్లా

గంజాయి రహితంగా ఎన్టీఆర్ జిల్లా
ఎన్టీఆర్ జిల్లాను గంజాయి రహిత జిల్లాగా తీర్చిదిద్దడంలో జిల్లా యంత్రాంగం, పోలీస్ శాఖ, వివిధ ప్రభుత్వ శాఖలు, స్వచ్ఛంద సంస్థలు సమన్వయంతో కృషి చేసి ఫలితాలను సాధించామని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ, విజయవాడ పోలీస్ కమిషనర్ ఎస్.వి.రాజశేఖర్ బాబు తెలిపారు. విజయవాడకు సంబంధించి ‘గంజాయి బ్యాచ్, బ్లేడ్ బ్యాచ్’ అనే నానుడి ఇకపై వినిపించకుండా చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని తెలిపారు. గంజాయి నిర్మూలనకు ఇప్పటికే ‘డ్రగ్స్‌పై దండయాత్ర 1.1’, ‘డ్రగ్స్‌పై దండయాత్ర 2.0’ వంటి కార్యక్రమాలను చేపట్టి జిల్లాలో విస్తృత స్థాయిలో అవగాహన, నియంత్రణ చర్యలు చేపట్టినట్లు వివరించారు. గంజాయి కార్యకలాపాలకు సంబంధించిన సమాచారాన్ని అందించే వారి వివరాలను పూర్తిగా గోప్యంగా ఉంచుతామని తెలిపారు. ‘ఈగల్ ఛాలెంజ్’లో భాగంగా 1972కు సమాచారం అందించి బహుమతి పొందవచ్చని తెలిపారు.
Andhra Pradesh
NTR District
Vijayawada
Ganja-Free District
Anti-Drug Campaign
Ganja
Drug-Free
Police Department
District Administration
డ్రగ్స్‌పై దండయాత్ర
డ్రగ్స్ నియంత్రణ
విజయవాడ పోలీసులు
మాదకద్రవ్యాల నివారణ
Scroll for the next article