News10th Aug 04:07 PMSunil Byrisetty1 min read

ఎన్టీఆర్ జిల్లాలో ప్రత్యేక ఆధార్ సేవా శిబిరాలు

ప్రజలకు ఆధార్ సంబంధిత సేవలను సులభంగా, వేగవంతంగా, పారదర్శకంగా అందించేందుకు ఎన్టీఆర్ జిల్లాలో ప్రత్యేక ఆధార్ సేవా శిబిరాలను నిర్వహిస్తున్నారు. ఎంపిక చేసిన స్వర్ణ గ్రామాలు, స్వర్ణ వార

ఎన్టీఆర్ జిల్లాలో ప్రత్యేక ఆధార్ సేవా శిబిరాలు
ప్రజలకు ఆధార్ సంబంధిత సేవలను సులభంగా, వేగవంతంగా, పారదర్శకంగా అందించేందుకు ఎన్టీఆర్ జిల్లాలో ప్రత్యేక ఆధార్ సేవా శిబిరాలను నిర్వహిస్తున్నారు. ఎంపిక చేసిన స్వర్ణ గ్రామాలు, స్వర్ణ వార్డు కార్యాలయాలతో పాటు ఎంపిక చేయబడిన ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో ప్రత్యేక ఆధార్ సేవా శిబిరాలను నిర్వహించనున్నారు. ఈ శిబిరాలు 11వ తేదీ నుంచి 14వ తేదీ వరకు, మళ్లీ 17 నుంచి 29వ తేదీ వరకు నిర్వహించబడతాయని జిల్లా కలెక్టర్ లక్ష్మీశ తెలిపారు. ప్రజలు తమ ప్రాంతానికి సమీపంలో అందుబాటులో ఉన్న ప్రత్యేక ఆధార్ శిబిరాలను సద్వినియోగం చేసుకొని, ఆధార్‌కు సంబంధించిన అవసరమైన సేవలను పొందవచ్చని సూచించారు. ప్రత్యేక శిబిరాలలో కొత్త ఆధార్ నమోదు, ఆధార్‌లో పేరును సరిచేయడం/ నవీకరించడం, చిరునామా మార్పు, జనన తేదీ, మొబైల్ నంబర్, బయోమెట్రిక్ వివరాల నవీకరణ చేయడం జరుగుతుందన్నారు. 5 నుంచి 15 సంవత్సరాల మధ్య వయస్సుగల పిల్లలకు తప్పనిసరి బయోమెట్రిక్ అప్డేట్ చేయించాలన్నారు. 15 సంవత్సరాలు, అంతకంటే పైబడిన వారికి అవసరమైన బయోమెట్రిక్ నవీకరణ, ఇతర ఆధార్ సంబంధిత సవరణలు, నవీకరణ సేవలు అందుబాటులో ఉంటాయన్నారు.
Andhra Pradesh
NTR District
Aadhaar Service Camps
Aadhaar Services
Aadhaar Update
Aadhaar Enrollment
Biometric Update
ప్రభుత్వ సేవలు
ఆధార్ కార్డు
ప్రత్యేక శిబిరాలు
Scroll for the next article