News30th Oct 03:25 PMSunil Byrisetty1 min read
నిలిచిపోయిన ఎన్టీఆర్ వైద్య సేవలు
ఆంధ్రప్రదేశ్‌లో ఎన్టీఆర్ వైద్య సేవ పథకం కింద ఉచిత చికిత్సలు పూర్తిగా నిలిచిపోయాయి. ఆస్పత్రుల యాజమాన్యాలు ధర్నాలు చేస్తున్నాయి. బిల్లులు ఇస్తేనే వైద్యం చేస్తామంటున్నాయి. ప్రభుత్వ ఆస
ఆంధ్రప్రదేశ్‌లో ఎన్టీఆర్ వైద్య సేవ పథకం కింద ఉచిత చికిత్సలు పూర్తిగా నిలిచిపోయాయి. ఆస్పత్రుల యాజమాన్యాలు ధర్నాలు చేస్తున్నాయి. బిల్లులు ఇస్తేనే వైద్యం చేస్తామంటున్నాయి. ప్రభుత్వ ఆస్పత్రుల్లో కాని ఆపరేషన్లు, చికిత్సలు ప్రైవేటు ఆస్పత్రుల్లో ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా అందుబాటులో ఉంటాయి. పేదలు చేయించుకుంటూ ఉంటారు. కానీ ఇప్పుడు అన్నీ ఆగిపోయాయి. దీంతో చాలా మంది చికిత్సను వాయిదా వేసుకుంటున్నారు. లేదా సొంత డబ్బులతో చికిత్స చేయించుకుంటున్నారు. కొంత మంది ప్రభుత్వ ఆస్పత్రులకే వెళ్తున్నారు. ఎలా చూసినా పేద రోగులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కానీ ప్రభుత్వం ఆస్పత్రులతో చర్చలకు ముందుకు రావడం లేదు.