News9th Oct 01:10 PMSunil Byrisetty1 min read

ఎన్టీఆర్ వైద్యసేవకు బ్రేక్.. రేపటి నుంచి నిలిపివేత

పెండింగ్ బకాయిలు పేరుకుపోవడంతో ఎన్టీఆర్ వైద్య సేవకు బ్రేక్ పడనుంది. ఏపీలో ఎన్టీఆర్ వైద్య సేవలు ఈ నెల 10వ తేదీ నుంచి బంద్ కానున్నాయి. నెట్వర్క్ ఆసుపత్రులకు ఎన్టీఆర్ ట్రస్ట్ నుంచి బక

ఎన్టీఆర్ వైద్యసేవకు బ్రేక్.. రేపటి నుంచి నిలిపివేత
పెండింగ్ బకాయిలు పేరుకుపోవడంతో ఎన్టీఆర్ వైద్య సేవకు బ్రేక్ పడనుంది. ఏపీలో ఎన్టీఆర్ వైద్య సేవలు ఈ నెల 10వ తేదీ నుంచి బంద్ కానున్నాయి. నెట్వర్క్ ఆసుపత్రులకు ఎన్టీఆర్ ట్రస్ట్ నుంచి బకాయిలు చెల్లించక పోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఏపీ స్పెషాలిటీ ఆసుపత్రుల అసోసియేషన్ (ఆషా) తెలిపింది. రాష్ట్ర వ్యాప్తంగా ఆసుపత్రులకు రూ.2,700 కోట్లకు పైగా బకాయిలు ఉన్నాయని, అందుకే ఈ సేవలను నిలిపివేస్తున్నామని వారు ప్రకటించారు. ఈ మేరకు పత్రికా ప్రకటన విడుదల చేశారు.
Andhra Pradesh
NTR Health Scheme
Healthcare
Hospitals
Medical Services
NTR Trust
Health Crisis
వైద్య బకాయిలు
ఎన్టీఆర్ ట్రస్ట్
ఆషా అసోసియేషన్
ఆరోగ్య సేవల నిలిపివేత
Scroll for the next article