News23rd Oct 04:43 PMSunil Byrisetty1 min read
26న ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయ రూబీ జూబ్లీ వేడుకలు
దేశంలోనే తొలి ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయంగా 1986లో ఏర్పాటై, వైద్య విద్య, పరిశోధన, ఆరోగ్య సేవల అభివృద్ధిలో నాలుగు దశాబ్దాలుగా కీలక పాత్ర పోషిస్తున్న డా. ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్
దేశంలోనే తొలి ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయంగా 1986లో ఏర్పాటై, వైద్య విద్య, పరిశోధన, ఆరోగ్య సేవల అభివృద్ధిలో నాలుగు దశాబ్దాలుగా కీలక పాత్ర పోషిస్తున్న డా. ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం రూబీ జూబ్లీ వేడుకలకు భారత ఉపరాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఈ నెల 26న విజయవాడలో నిర్వహించనున్న వేడుకలకు రాష్ట్ర గవర్నర్ జస్టిస్ (విశ్రాంత) ఎస్. అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విశిష్ట అతిథులుగా, మంత్రి కొలుసు పార్థసారథి, జాతీయ వైద్య కమిషన్ పరిధిలోని మెడికల్ అసెస్‌మెంట్ అండ్ రేటింగ్ బోర్డు (ఎంఏఆర్‌బీ) అధ్యక్షుడు డాక్టర్ ఎం.కె. రమేష్ గౌరవ అతిథులుగా పాల్గొననున్నారు. వేడుకల ఏర్పాట్లను విశ్వవిద్యాలయ ఉపకులపతి డాక్టర్ పి. చంద్రశేఖర్, రిజిస్ట్రార్ డాక్టర్ టి. సాయి సుధీర్ శుక్రవారం విశ్వవిద్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వివరించారు. 1986లో ఏర్పాటైన ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం వైద్య విద్య, పరిశోధన, ఆరోగ్య సేవల అభివృద్ధిలో కీలక పాత్ర పోషించిందని వీసీ డాక్టర్ పి. చంద్రశేఖర్ తెలిపారు. వైద్య, దంత వైద్య, నర్సింగ్, ఆయుష్, ఫిజియోథెరపీ, అనుబంధ ఆరోగ్య విద్యా విభాగాల్లో వేలాది మంది నిపుణులను తీర్చిదిద్దిందన్నారు.