Entertainment11th Aug 10:41 AMSunil Byrisetty1 min read
పాతికేళ్లు పూర్తి చేసుకున్న ఎన్టీఆర్
కథానాయకుడిగా మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ప్రయాణం పాతికేళ్ళ మైలురాయి చేరుకుంది. 'ఆర్ఆర్ఆర్: రౌద్రం రణం రుధిరం'తో పాన్ ఇండియా విజయం అందుకున్న ఆయన.. 'దేవర'తో విజయ పరంపర కొనసాగించారు. ఆ
కథానాయకుడిగా మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ప్రయాణం పాతికేళ్ళ మైలురాయి చేరుకుంది. 'ఆర్ఆర్ఆర్: రౌద్రం రణం రుధిరం'తో పాన్ ఇండియా విజయం అందుకున్న ఆయన.. 'దేవర'తో విజయ పరంపర కొనసాగించారు. ఆల్రెడీ బాలీవుడ్ ప్రేక్షకులకు ఆయన తెలుసు. ఉత్తరాదిలో ఆయనకు అభిమానులు ఉన్నారు. ఇప్పుడు బాలీవుడ్ సినిమా 'వార్ 2'లో ఎన్టీఆర్ నటించారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో పాతికేళ్ల సినీ ప్రయాణం గురించి ఎన్టీఆర్ మాట్లాడారు. తాతయ్య ఎన్టీఆర్ ఆశీస్సులు తనకు ఉన్నంత కాలం తనను ఎవరూ ఆపలేరని చెప్పారు. సినిమా వేడుకలో అభిమానులు కాలర్ ఎగరేసే సినిమా చేశానని చెప్పడం ఎన్టీఆర్ అలవాటు. ఈసారి ఆయన రెండు కాలర్లు ఎగరేశారు. 'వార్ 2' డబుల్ బ్లాక్ బస్టర్ అని చెప్పడం ఆయన ఉద్దేశంగా కనిపిస్తోంది.