News30th Jul 04:58 PMSunil Byrisetty1 min read

ఎన్టీఆర్ ట్రస్ట్‌తో 29 ఏళ్లుగా ప్రజాసేవ

ఆపదలో ఉన్నవారికి అండగా నిలిచి సాయం చేయడంలోనే నిజమైన సంతృప్తి లభిస్తుందని ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి అన్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్‌లో 29 ఏళ్లుగా తన ప్ర

ఎన్టీఆర్ ట్రస్ట్‌తో 29 ఏళ్లుగా ప్రజాసేవ
ఆపదలో ఉన్నవారికి అండగా నిలిచి సాయం చేయడంలోనే నిజమైన సంతృప్తి లభిస్తుందని ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి అన్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్‌లో 29 ఏళ్లుగా తన ప్రయాణం ప్రజాసేవకే అంకితమైందని తెలిపారు. కుప్పం ప్రజలు తమ కుటుంబంపై చూపిస్తున్న ప్రేమాభిమానాలే తమకు కొండంత బలమని చెప్పారు. కుప్పం నియోజకవర్గంలో ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మహిళలకు కుట్టు మిషన్లు, చిరు వ్యాపారులకు తోపుడు బండ్లు, వినికిడి సమస్య ఉన్న పలువురికి మిషన్లు అందజేశారు. కుప్పంలో ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘స్వయం ఉపాధికి చేయూత’ కార్యక్రమంలో భువనేశ్వరి పాల్గొన్నారు. మహిళలకు ఉపాధి అవకాశాలు, ఆర్థిక చేయూత కల్పించాలనే లక్ష్యంతో కుప్పంలో స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌ ఏర్పాటు చేశామని చెప్పారు. కుప్పం మహిళలు తయారు చేస్తున్న ఉత్పత్తులకు విస్తృత మార్కెటింగ్‌ కల్పించేందుకు హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ట్రస్ట్ కార్యాలయంలో ‘స్త్రీ శక్తి హస్తకళా స్టోర్’ ఏర్పాటు చేశామని తెలిపారు.
Andhra Pradesh
Women Empowerment
Skill Development
Nara Bhuvaneswari
NTR Memorial Trust
Kuppam
స్కిల్ డెవలప్‌మెంట్
కుట్టు మిషన్లు
తోపుడు బండ్లు
సామాజిక సేవ
ఎన్టీఆర్ ట్రస్ట్
Scroll for the next article