News16th Oct 05:59 PMSunil Byrisetty1 min read

పేదల జీవితాలకు ఎన్టీఆర్ ట్రస్ట్ భరోసా

రక్తదానం కేవలం దానం మాత్రమే కాదని, మరో మనిషి జీవితానికి ఇచ్చే భరోసా అని ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి అన్నారు. చికిత్స సమయంలో రక్తం అవసరమైన కుటుంబం ప

పేదల జీవితాలకు ఎన్టీఆర్ ట్రస్ట్ భరోసా
రక్తదానం కేవలం దానం మాత్రమే కాదని, మరో మనిషి జీవితానికి ఇచ్చే భరోసా అని ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి అన్నారు. చికిత్స సమయంలో రక్తం అవసరమైన కుటుంబం పడే ఆందోళనను అర్థం చేసుకుని, పేద రోగులకు అండగా నిలవాలనే సంకల్పంతో విజయవాడలో ఆధునిక రక్తనిధి కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. విజయవాడలో ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన తలసేమియా కేర్ సెంటర్, రక్తనిధి కేంద్రాన్ని ఆమె ప్రారంభించారు.ఈ సందర్భంగా నారా భువనేశ్వరి మాట్లాడుతూ... విజయవాడ ప్రజలకు సేవ, నమ్మకం, భరోసాకు చిరునామాగా ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ భవనం నిలుస్తుందని చెప్పారు. ఈ రక్తనిధి కేంద్రాన్ని నగర ప్రజలకు అంకితం చేస్తున్నట్లు ప్రకటించారు. ఇది కేవలం భవనం మాత్రమే కాదని, పేద రోగుల జీవితాలకు వారధి అని పేర్కొన్నారు. ఆరోగ్యంగా ఉన్న ప్రతి ఒక్కరూ రక్తదానం చేయాలని పిలుపునిచ్చారు. స్వర్గీయ ఎన్టీఆర్‌కు ప్రజలంటే అపారమైన ప్రేమ ఉండేదని, ప్రజల కోసం పనిచేయడమే ఆయన జీవితంలో భాగమని భువనేశ్వరి తెలిపారు. సామాన్యుడి జీవన ప్రమాణాలు మెరుగుపడాలని, సమాజంలోని చివరి వ్యక్తికి సైతం మెరుగైన జీవితం అందాలని ఆయన ఆకాంక్షించేవారని చెప్పారు.
Scroll for the next article