News21st Dec 04:38 PMSunil Byrisetty1 min read
దుబాయ్‌లో ‘ఎన్టీఆర్ సజీవ చరిత్ర’ పుస్తకావిష్కరణ
దుబాయ్‌లో నిర్వహించిన తెలుగు వారి ఆత్మీయ సమావేశంలో టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు, రాజకీయ కార్యదర్శి టి.డి. జనార్దన్, విక్రమ్ పూల రూపొందించిన ‘ఎన్టీఆర్ సజీవ చరిత్ర’ పుస్తకం, ఆడియో ఆవ
దుబాయ్‌లో నిర్వహించిన తెలుగు వారి ఆత్మీయ సమావేశంలో టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు, రాజకీయ కార్యదర్శి టి.డి. జనార్దన్, విక్రమ్ పూల రూపొందించిన ‘ఎన్టీఆర్ సజీవ చరిత్ర’ పుస్తకం, ఆడియో ఆవిష్కరణ ఘనంగా జరిగింది.
ఈ సందర్భంగా టీడీ జనార్ధన్ మాట్లాడుతూ అన్న ఎన్టీఆర్ అపూర్వమైన వ్యక్తిత్వాన్ని స్మరిస్తూ, 1984 నాటి కీలక రాజకీయ పరిణామాలను గుర్తు చేసుకున్నారు. ఎన్టీఆర్ స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకుని, పోరాట పటిమతో జీవితంలో ముందుకు సాగాలని వారు ఆకాంక్షించారు.
ఎన్టీఆర్ సినీ రాజకీయ రంగాల్లో చేసిన కృషిని, ఆయన నెలకొల్పిన ఉన్నత ప్రమాణాలను ప్రస్తావించారు. ఆంధ్రదేశానికి ఎంతోమంది ముఖ్యమంత్రులు పాలించిన అందరికి గుర్తుండిపోయేది ఒక్క ఎన్టీఆర్ మాత్రమేనని పేర్కొన్నారు. ఎన్టీఆర్ శత జయంతిని పురస్కరించుకుని తాము ఎన్టీఆర్ సిద్ధాంతాలను, NTR భావజాలాన్ని ముందుతరానికి, తర్వాత తరానికి తెలియజెప్పాలని ఉద్దేశ్యంతో కమిటీ ఏర్పాటు చేసామని అందరి సహకార సమన్వయంతో ఎన్టీఆర్ పై పలు పుస్తకాలు వెలువరిస్తున్నామని ప్రత్యేకంగా అన్న ఎన్టీఆర్ యూట్యూబ్ ఛానల్ ఏర్పాటు చేశామని భవిష్యత్తులో ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేపడతామని, ఎన్టీఆర్ పేరుని అజరామరం చేయడమే తన లక్ష్యమని పేర్కొన్నారు.