News15th Jun 01:14 PMSunil Byrisetty1 min read

నాడు శునకానందం.. నేడు ప్రజాసంక్షేమం!

గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గ పరిధిలోని తక్కెలపాడు గ్రామంలో ఎన్టీఆర్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ పాల్గొ

నాడు శునకానందం.. నేడు ప్రజాసంక్షేమం!
గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గ పరిధిలోని తక్కెలపాడు గ్రామంలో ఎన్టీఆర్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ పాల్గొన్నారు. అనంతరం సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేశారు. పెమ్మసాని మాట్లాడుతూ వైసీపీ 5 సం.ల పాలనలో టీడీపీ కార్యకర్తలు నేతలను తీవ్ర ఇబ్బందులు పెట్టి శునకానందం పొందారని అన్నారు. సంక్షేమ పథకాల ఆద్యుడు, పేదబడుగు వర్గాలకు రాజకీయాలకు ప్రాధాన్యత ఇచ్చిన ఘన నేత ఎన్టీఆర్ అని కొనియాడారు. నారా లోకేశ్ యువగళం పాదయాత్రతో ఎన్నో కష్టనష్టాలను ఎదుర్కొని టీడీపీ విజయానికి నాంది పలికారని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఎంతో మంది యువతను ఎమ్మెల్యేలుగా పరిచయం చేసిన నేత చంద్రబాబు అని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం ప్రజాసంక్షేమానికి పాటుపడుతోందని వివరించారు. అభివృద్ధిలో మనమందరం ఏకతాటిపై నడవాలని పిలుపునిచ్చారు.
Andhra Pradesh news
Ap politics
Guntur
NTR statue
Pemmasani Chandrasekhar
MLA Dhulipalla Narendra Kumar
ఎన్టీఆర్ విగ్రహ ఆవిష్కరణ
సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ
Scroll for the next article