News14th Dec 04:42 PMSunil Byrisetty1 min read
రాజకీయాల్లో ఎన్టీఆర్ ముద్ర శాశ్వతం
రాష్ట్ర, దేశ రాజకీయాల్లో ఎన్టీఆర్ ముద్ర శాశ్వతమైనది, విశిష్టమైనది అని, సూర్యచంద్రులు ఉన్నంత వరకు ఎన్టీఆర్ రామారావు పేరు ఎప్పటికీ నిలిచిపోతుందని, పార్లమెంట్ సభ్యురాలు పురందేశ్వరి పే
రాష్ట్ర, దేశ రాజకీయాల్లో ఎన్టీఆర్ ముద్ర శాశ్వతమైనది, విశిష్టమైనది అని, సూర్యచంద్రులు ఉన్నంత వరకు ఎన్టీఆర్ రామారావు పేరు ఎప్పటికీ నిలిచిపోతుందని, పార్లమెంట్ సభ్యురాలు పురందేశ్వరి పేర్కొన్నారు. ఆడియో రూపంలో రూపొందించిన 1984 ఆగస్టు పరిరక్షణోద్యమం సజీవ చరిత్ర పుస్తకాన్ని డిసెంబర్ 13 హైదరాబాద్ FNCC లో నిర్వహించిన కార్యక్రమంలో పేర్కొన్న పురందేశ్వరి ముఖ్య అతిథులుగా పాల్గొని ఆడియోని ఆవిష్కరించారు. ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి మా తెలుగు తల్లికి గీతాలాపన జరిగింది.
జయప్రద ఫౌండేషన్ ఆధ్వర్యంలో టీడీ జనార్దన్ చైర్మన్ గా ఉన్న ఎన్టీఆర్ లిటరేచర్ కమిటీ రూపొందించిన సజీవ చరిత్ర పుస్తకం ఆడియో రూపం విడుదల కార్యక్రమం జరిగింది. ఇందులో సీనియర్ రాజకీయ నేత, మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు, నందమూరి రామకృష్ణ, సినీ నిర్మాత కె ఎస్ రామారావు పాల్గొన్నారు.
ముందుగా రచయిత విక్రమ్ పూల పుస్తక పరిచయం చేశారు.
స్వాగతోపన్యాసం చేసిన కమిటీ చైర్మన్ టీడీ జనార్దన్.. ఎన్టీఆర్ సినీ రాజకీయ రంగాల్లో చేసిన కృషిని, ఆయన నెలకొల్పిన ఉన్నత ప్రమాణాలను ప్రస్తావించారు.