Education11th Apr 09:31 AMSunil Byrisetty1 min read

జర్మనీలో ఏపీ నర్సింగ్ విద్యార్ధులకు ఉద్యోగాలు

ఏపీ విద్యార్థులకు జర్మనీలో ఉద్యోగావకాశాలు ఉన్నాయని వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. నర్సింగ్ కళాశాలలు యాజమాన్యాల అసోసియేషన్‌తో మంత్రి సత్యకుమార్ భేటీ అయ్యారు. ఈ సం

జర్మనీలో ఏపీ నర్సింగ్ విద్యార్ధులకు ఉద్యోగాలు
ఏపీ విద్యార్థులకు జర్మనీలో ఉద్యోగావకాశాలు ఉన్నాయని వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. నర్సింగ్ కళాశాలలు యాజమాన్యాల అసోసియేషన్‌తో మంత్రి సత్యకుమార్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిబంధనల ప్రకారం నర్సింగ్ కళాశాలలు నిర్వహణ ఉండాలని సూచించారు. అలాగే కళాశాలలకు అనుబంధంగా ఆసుపత్రి కచ్చితంగా ఉండాలన్నారు. నర్సింగ్ విద్యార్థుల ఉపాధిపై జర్మనీతో ప్రభుత్వం ఒప్పందం చేసుకుందని తెలిపారు. నెలకు రూ.2.5 లక్షల వేతనంతో జర్మనీలో ఉద్యోగాలు లభిస్తాయని ఆయన తెలిపారు. నర్సింగ్‌కు ఉజ్వల కెరీర్ ఉందన్నారు. దేశవిదేశాల్లో డిమాండ్ ఉన్న నర్సింగ్ కోర్సు చేస్తే ఉద్యోగ, ఉపాధి అవకాశాలకు ఢోకా లేదని మంత్రి స్పష్టం చేశారు
Nursing students
germany minister
Satya Kumar Yadav
నర్సింగ్ కోర్సు
ఉపాధిపై జర్మనీతో ప్రభుత్వం ఒప్పందం
Scroll for the next article