News26th Sep 06:00 PMSunil Byrisetty1 min read
పోషకాహారంతోనే ఆరోగ్యవంతమైన సమాజం
ఎన్టీఆర్ జిల్లాలో 9వ జాతీయ పోషణ మాసం కార్యక్రమాలను అక్టోబర్ 8 వరకు నిర్వహిస్తున్నట్లు ఐసిడిఎస్ అధికారులు తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 సంవత్సరాల సేవలను పురస్కరించుకుని “అం
ఎన్టీఆర్ జిల్లాలో 9వ జాతీయ పోషణ మాసం కార్యక్రమాలను అక్టోబర్ 8 వరకు నిర్వహిస్తున్నట్లు ఐసిడిఎస్ అధికారులు తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 సంవత్సరాల సేవలను పురస్కరించుకుని “అంగన్వాడీ ఉత్సవాలు” సెప్టెంబర్ 25 నుంచి అక్టోబర్ 7 వరకు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో, పోషణ మాసం, అంగన్వాడీ ఉత్సవాల్లో భాగంగా విజయవాడలో జిల్లా స్థాయి అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి డిఎంహెచ్ఓ డా.ఎ.శ్రవణ్ బాబు, డిఇఓ ఎల్.చంద్రకళ, నాగార్జున యూనివర్సిటీ ప్రొఫెసర్ డా.కె.శాంతిశ్రీ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా మహిళా మరియు శిశు సంక్షేమ & సాధికారత అధికారి రుక్సానా సుల్తానా బేగం మాట్లాడుతూ, గర్భం దాల్చిన వెంటనే గర్భిణీలు సమీపంలోని అంగన్వాడీ కేంద్రంలో తమ పేరును నమోదు చేసుకోవాలని సూచించారు. అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందించే పోషకాహారాన్ని గర్భిణీలు తప్పనిసరిగా తీసుకోవాలని, ఐరన్ అధికంగా ఉండే ఆహార పదార్థాలను తీసుకోవడం ద్వారా తల్లి, శిశువు ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవచ్చని తెలిపారు.