News1st Aug 05:41 PMSunil Byrisetty1 min read

పోషకాహార రంగం.. ఉపాధికి స్వర్ణద్వారం

పోషకాహార ఉత్పత్తులు, విలువ ఆధారిత ఆహార పదార్థాల తయారీ, ప్రాసెసింగ్, ప్యాకేజింగ్, మార్కెటింగ్ వంటి రంగాల్లో మహిళలకు విస్తృత అవకాశాలు ఉన్నాయని, మ‌హిళ‌ల ఆర్థిక సాధికార‌త‌కు వీటిని స‌ద

పోషకాహార రంగం.. ఉపాధికి స్వర్ణద్వారం
పోషకాహార ఉత్పత్తులు, విలువ ఆధారిత ఆహార పదార్థాల తయారీ, ప్రాసెసింగ్, ప్యాకేజింగ్, మార్కెటింగ్ వంటి రంగాల్లో మహిళలకు విస్తృత అవకాశాలు ఉన్నాయని, మ‌హిళ‌ల ఆర్థిక సాధికార‌త‌కు వీటిని స‌ద్వినియోగం చేసుకోవాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ అన్నారు. ఎన్‌టీఆర్ జిల్లా-రైజ్‌.. నేటివ్ టేబుల్‌, ఫిక్కీ ఎఫ్ఎల్‌వో విజ‌య‌వాడ సంస్థ‌ల భాగ‌స్వామ్యంతో ఇబ్ర‌హీంప‌ట్నంలో స్వ‌యం స‌హాయ‌క సంఘ మ‌హిళ‌ల‌కు ప్ర‌త్యేక శిక్ష‌ణ కార్య‌క్ర‌మం జ‌రిగింది. పోష‌కాలు మెండుగా ఉండే బ్రౌన్ గుడ్ల ఉత్పత్తి విధివిధానాల‌పై అవ‌గాహ‌న క‌ల్పించారు. సహజ సిద్ధమైన పద్ధతుల్లో కోళ్ల పెంపకం చేపట్టడం, పోషకాలతో కూడిన గుడ్ల ఉత్పత్తి, మార్కెటింగ్ అంశాల‌ను వివ‌రించారు. యాంటీబయోటిక్స్‌ను ఉపయోగించ‌కుండా కేవలం సహజమైన మేత, ఉన్నతమైన పోషకాలతో కోళ్లను ఎలా పెంచాలో వివరించారు. ఆరోగ్యాన్ని మెరుగుప‌రిచేందుకు, రోగనిరోధక శక్తిని పెంచే పోష‌కాల‌కు నెల‌వైన గుడ్ల ఉత్పత్తికి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై శిక్షణ ఇచ్చారు.
Andhra Pradesh
Nutrition
Women's Empowerment
Self Help Groups
SHG Women
NTR District
District Collector
Brown Eggs
Poultry Farming
మహిళా ఉపాధి
ఫిక్కీ ఎఫ్ఎల్‌వో
రైజ్
నేటివ్ టేబుల్
పోషకాహార శిక్షణ
ఆహార ప్రాసెసింగ్
Scroll for the next article