News20th Jan 01:10 PMSunil Byrisetty1 min read
ఆర్టీఐ కమీషనర్ల ప్రమాణ స్వీకారం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమాచార కమిషన్ కు నూతనంగా నియమితులైన కమిషనర్లతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ ప్రమాణ స్వీకారం చేయించారు. సచివాలయంలో నూతన కమిషనర్లతో ప్రమాణం చేయించారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమాచార కమిషన్ కు నూతనంగా నియమితులైన కమిషనర్లతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ ప్రమాణ స్వీకారం చేయించారు. సచివాలయంలో నూతన కమిషనర్లతో ప్రమాణం చేయించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమాచార కమిషన్ కు ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం చీఫ్ కమిషనర్ సహా ఇతర కమిషనర్లను నియమించడం జరిగింది. గవర్నర్ జస్టిస్ ఎస్.అబ్దుల్ నజీర్ ఆదేశాల మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ నూతన కమిషనర్లతో ప్రమాణ స్వీకారం చేయించారు. రాష్ట్ర సమాచార కమిషన్ చీఫ్ కమిషనర్ గా వజ్జా శ్రీనివాసరావుతో ముందుగా సిఎస్ విజయానంద్ ప్రమాణం చేయించారు. తదుపరి పరవాడ సింహాచలం నాయుడు, వంటేరు రవిబాబు, ఆదెన్న గాజుల, శరత్ చంద్ర కళ్యాణ చక్రవర్తి వట్టికూటిచే సమాచార కమీషనర్లుగా ప్రమాణం చేయించారు. కార్యక్రమంలో రాష్ట్ర సర్వీసెస్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్.ఎస్.రావత్,ఎపి సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు రామకృష్ణ,ఆర్టీఐ అధికారులు,నూతన ఆర్టీఐ కమిషనర్ల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.