News14th Nov 03:38 PMSunil Byrisetty1 min read

రాజధానిలో మరో ప్రతిష్టాత్మక హోటల్

ప్ర‌ముఖ హోట‌ళ్ల సంస్థ‌.. ఒబెరాయ్ ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తికి రానుంది. సుమారు 175 కోట్ల రూపాయ‌ల పైగా పెట్టుబ‌డులు పెట్టేందుకు ఈ సంస్థ అంగీక‌రించింది. దీనికి సంబంధించి తాజాగా సీఎం చంద్ర

రాజధానిలో మరో ప్రతిష్టాత్మక హోటల్
ప్ర‌ముఖ హోట‌ళ్ల సంస్థ‌.. ఒబెరాయ్ ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తికి రానుంది. సుమారు 175 కోట్ల రూపాయ‌ల పైగా పెట్టుబ‌డులు పెట్టేందుకు ఈ సంస్థ అంగీక‌రించింది. దీనికి సంబంధించి తాజాగా సీఎం చంద్ర‌బాబు స‌మ‌క్షంలోనే విశాఖ‌లో ఒప్పందం చేసుకుంది. ఒబెరాయ్ హోట‌ళ్లు ప్ర‌పంచ ప్ర‌ఖ్యాతి చెందాయి. సాధార‌ణంగా నిర్మించే హోట‌ళ్ల‌కు.. ఒబెరాయ్ గ్రూప్ నిర్మించే హోట‌ళ్లు, స‌దుపాయాల‌కు చాలా వ్య‌త్యాసం ఉంది. టాటా వంటివి కూడా హోట‌ళ్లు నిర్మిస్తున్నా.. ఒబెరాయ్ మాత్రం చాలా భిన్నంగా ఉంటుంది. ఒక ప్రాంతంలో హోట‌ల్ క‌ట్టాలంటే.. వెనుక‌-ముందు అనేక విష‌యాల‌ను ప‌రిశీలిస్తారు. ఆప్రాంతం అభివృద్ధి, రాబోయే 30 సంవ‌త్స‌రాల కాలంలో ఏమేర‌కు డెవ‌ల‌ప్ అవుతుంది? ఎంత మేర‌కు ఎకాన‌మీ యాక్టివిటీస్ జ‌రుగుతాయి? అనే అంశాల‌ను ఒబెరాయ్ గ్రూప్ ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకున్న త‌ర్వాతే అక్క‌డ హోట‌ల్‌ను నిర్మించేందుకు ముందుకు వ‌స్తుంది.
Scroll for the next article