News12th Oct 02:27 PMSunil Byrisetty1 min read
టిడ్కో ఇల్లు వచ్చిందా.. ఉండాల్సిందే!
టిడ్కో గృహా సముదాయాల వద్ద ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలు జరగడానికి వీల్లేదని, నివాసం ఉండేవారికి అవసరమైన అన్ని మౌలికవసతులు కల్పించామని, ఇళ్లు పొందిన వారు గృహాలను సద్వినియోగం చేసుకోవాలన
టిడ్కో గృహా సముదాయాల వద్ద ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలు జరగడానికి వీల్లేదని, నివాసం ఉండేవారికి అవసరమైన అన్ని మౌలికవసతులు కల్పించామని, ఇళ్లు పొందిన వారు గృహాలను సద్వినియోగం చేసుకోవాలని మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు సూచించారు. 5,520 ఇళ్లల్లో నివాసముండే వారికి త్వరలోనే ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, పాఠశాల.. సచివాలయ భవనాలు, కమర్షియల్ కాంప్లెక్స్ కూడా అందుబాటులోకి రానున్నట్టు ఆయన చెప్పారు. సీఎస్సార్ నిధుల కింద ఓ.ఎన్.జీ.సీ సంస్థ సహకారంతో ప్రముఖ స్వచ్ఛంద సేవా సంస్థ ఆసిస్ట్ ఎన్టీఆర్ నగర్లో ఏర్పాటు చేసిన ఉచిత తాగునీటి ప్లాంట్ ను ఎమ్మెల్యే ప్రత్తిపాటి, ఎంపీ లావు శ్రీ కృష్ణదేవరాయలు సంయుక్తంగా ప్రారంభించారు. టిడ్కో గృహాల్లో ఉండేవారు క్రమశిక్షణతో ఉండాలని, పరిశుభ్రతకు ప్రాధాన్యమివ్వాలని, తమ చుట్టుపక్కల అసాంఘిక కార్యకలపాలకు తావులేకుండా చూడాలని ప్రత్తిపాటి సూచించారు. గృహాలు పొంది నివాసం ఉండనప్పుడు వారికి కేటాయించిన ఇళ్లను, అర్హులైన ఇతరులకు కేటాయిస్తామని, ఈ సమస్యపై ఇప్పటికే అసెంబ్లీలో మాట్లాడి, మంత్రి నారాయణతో కూడా చర్చించానని ప్రత్తిపాటి చెప్పారు. గతంలో నివాసముండాలని చెప్పినప్పుడు కొన్నిరోజులు నివాసముండి వదిలేస్తున్నారన్నారు. అలా కాకుండా విధిగా 6 నెలలు నివాసమున్నట్టు అధికారులు గుర్తిస్తేనే లబ్ధిదారులు తమ ఇళ్లల్లో ఉంటున్నట్టు నిర్ధరిస్తామన్నారు.