News26th Mar 08:37 AMSunil Byrisetty1 min read

అరసవల్లిలో ఆక్టోపస్

అరసవల్లి శ్రీ సూర్య నారాయణ స్వామి వారి ఆలయంలో ఆక్టోపస్ కమాండోలు మాక్ డ్రిల్ నిర్వహించారు. అత్యవసర పరిస్థితుల్లోనూ, ఉగ్రవాదులు దాడులు, ఏదైనా అవాంఛనీయ సంఘటన జరిగినప్పుడు ఏ విధంగా ప్ర

అరసవల్లిలో ఆక్టోపస్
అరసవల్లి శ్రీ సూర్య నారాయణ స్వామి వారి ఆలయంలో ఆక్టోపస్ కమాండోలు మాక్ డ్రిల్ నిర్వహించారు. అత్యవసర పరిస్థితుల్లోనూ, ఉగ్రవాదులు దాడులు, ఏదైనా అవాంఛనీయ సంఘటన జరిగినప్పుడు ఏ విధంగా ప్రతిస్పందించాలి, వారిని రక్షించేందుకు తీసుకునే చర్యలపై అవగాహన కోసం ముఖ్యమైన ఆలయాల్లో మాక్ డ్రిల్ కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. ఇందులో భాగంగా అరసవిల్లి శ్రీ సూర్యనారాయణ స్వామివారి దేవస్థానంలో ఎలైట్ కమాండో ఫోర్స్ ఆర్గనైజేషన్ ఫర్ కౌంటర్ టెర్రరిస్ట్ ఆపరేషన్స్ (ఆక్టోపస్) కౌంటర్ టెర్రరిస్ట్ ఆధ్వర్యంలో సేఫ్టీ మాక్ డ్రిల్ నిర్వహించింది. సాధారణంగా ప్రజలకు ఆలయం మూసివేయబడిన తర్వాత రాత్రి సమయంలో ఆలయ,పోలీసు, ఫైర్ అధికారులు,సిబ్బంది సమన్వయంతో కౌంటర్ టెర్రరిస్ట్ మాక్ డ్రిల్‌ నిర్వహించారు.ఈ మాక్ డ్రిల్ లక్ష్యం. ఆలయంలో ఏదైనా ఉగ్రవాద దాడి లాంటి దాడి లేదా అవాంఛనీయ సంఘటనలపై ప్రతి దాడిని నిర్వహించడం, భక్తులను, ఆలయాన్ని కాపాడటం లక్ష్యం. దానిని ప్రజలందరికీ తెలియజేయడంతోపాటు అవగాహన కల్పించేందుకు ఈ మాక్ డ్రిల్ నిర్వహించారు. మాక్ డ్రిల్‌లో ఆక్టోపస్ అదనపు ఎస్పీ రాజా రెడ్డి ఆధ్వర్యంలో స్వాట్ సిబ్బంది సుమారు 40 మంది పాల్గొన్నారు. ఆలయ, పోలీస్ అధికారులు ఈ మాక్ డ్రిల్‌ను పర్యవేక్షించారు. ఆలయంలో భద్రత, భద్రతా చర్యలను పెంచడానికి, అత్యవసర సమయంలో ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సూచనలు చేశారు.
Aditya Temple Octopus team
అరసవల్లి
Scroll for the next article