News2nd Nov 11:43 AMSunil Byrisetty1 min read

ఒడిశా తీరంలో అరుదైన అలివ్ రిడ్లే తాబేళ్ల రాక

ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన అలివ్ రిడ్లే సముద్రపు తాబేళ్ల సంతానోత్పత్తి కాలాన్ని అత్యంత సురక్షితంగా రక్షించేందుకు ఒడిశా ప్రభుత్వం కఠిన నిర్ణయం తీసుకుంది. ఏటా లక్షలాదిగా తీరాన

ఒడిశా తీరంలో అరుదైన అలివ్ రిడ్లే తాబేళ్ల రాక
ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన అలివ్ రిడ్లే సముద్రపు తాబేళ్ల సంతానోత్పత్తి కాలాన్ని అత్యంత సురక్షితంగా రక్షించేందుకు ఒడిశా ప్రభుత్వం కఠిన నిర్ణయం తీసుకుంది. ఏటా లక్షలాదిగా తీరానికి చేరే ఈ అరుదైన తాబేళ్ల రాకను పురస్కరించుకుని,నవంబర్ 1 నుండి మే 31 వరకు ఏడు నెలల పాటు సముద్రంలో చేపల వేటపై సర్కార్ సంపూర్ణ నిషేధం విధించింది. ఈ నిషేధం ధామ్రా నుండి దేవి నదీ ముఖద్వారం వరకు సుమారు 160 కిలోమీటర్ల తీర ప్రాంతంలో, సముద్రంలోకి 20 కిలోమీటర్ల దూరం వరకు పక్కాగా అమల్లోకి వచ్చింది. ఇందులో ప్రపంచ ప్రఖ్యాత గహిర్మత మెరైన్ శాంక్చువరీ ప్రాంతం కూడా ఉంది.ఈ సున్నితమైన ప్రాంతంలోనే వేల సంఖ్యలో అలివ్ రిడ్లే తాబేళ్లు ఇసుక తీరాలకు వచ్చి గుడ్లు పెడుతుంటాయి.ఈ ప్రక్రియ ఎలాంటి విఘాతం లేకుండా సాగేందుకు యంత్రాంగం రంగంలోకి దిగింది. సంతానోత్పత్తి సమయంలో సముద్రంలో భారీ మోటార్ బోట్లు, ఫిషింగ్ ట్రాన్సర్లు సంచరిస్తే.. వాటి నుంచి వచ్చే శబ్దాలు, ప్రొపెల్లర్ల (రెక్కల) తాకిడి వల్ల తాబేళ్లకు తీవ్ర ప్రాణాపాయం కలుగుతుంది. అంతేకాకుండా, వాటి గుడ్లను అపహరించే అసాంఘిక శక్తులను అడ్డుకోవడానికి ఈ కఠిన ఆంక్షలు అత్యంత అవసరమని అటవీ శాఖ అధికారులు స్పష్టం చేశారు.
Scroll for the next article