Politics18th Sep 11:01 AMSunil Byrisetty1 min read
ప్రతిపక్షం ఇవ్వకపోతే అసెంబ్లీకి రారా?
అసెంబ్లీ సమావేశాల ప్రారంభం సందర్భంగా వెంకటపాలెంలోని ఎన్టీఆర్ విగ్రహానికి వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. యూరియాతో సహా అన్ని సమస్యలపై
అసెంబ్లీ సమావేశాల ప్రారంభం సందర్భంగా వెంకటపాలెంలోని ఎన్టీఆర్ విగ్రహానికి వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. యూరియాతో సహా అన్ని సమస్యలపై చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. తప్పుడు ప్రచారాలు మానుకోవాలని వైసీపీ నాయకులకు గట్టిగా చెబుతున్నామని హెచ్చరిక చేశారు. కుంటి సాకులతో వైసీపీ సభ్యులు అసెంబ్లీ సమావేశాలకు రాకపోవడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ప్రజలు వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వకపోతే దాన్ని సాకుగా చూపి అసెంబ్లీకి రాకపోవడమేంటని మంత్రి అచ్చెన్న నిలదీశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర టీడీపీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.