Spiritual4th Aug 09:16 AMSunil Byrisetty1 min read

గంగమ్మ తల్లికి శ్రావణ సారె

నవులూరు రుద్రు వారి గంగమ్మ తల్లి దేవర గుడిలో శ్రావణ మాసాన్ని పురస్కరించుకొని గ్రామ రుద్రు వారి గంగమ్మ తల్లి దేవర కమిటీ ఆధ్వర్యంలో రుద్రు వారి ఆడపడుచులు సారె మహోత్సవం ఘనంగా నిర్వహిం

గంగమ్మ తల్లికి శ్రావణ సారె
నవులూరు రుద్రు వారి గంగమ్మ తల్లి దేవర గుడిలో శ్రావణ మాసాన్ని పురస్కరించుకొని గ్రామ రుద్రు వారి గంగమ్మ తల్లి దేవర కమిటీ ఆధ్వర్యంలో రుద్రు వారి ఆడపడుచులు సారె మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలోని శ్రీ నాగేంద్రస్వామి వారి పుట్ట తోట వద్ద నుంచి మహిళలు పసుపు, కుంకుమ, గాజులు, సారెతో ఊరేగింపు చేశారు. రుద్రు వారి గంగమ్మ తల్లి దేవర గుడి వరకు ఊరేగింపుగా వచ్చి అమ్మవారికి సారె సమర్పించారు. గ్రామ కూడలి ప్రాంతాలలో మహిళా భక్తులు అమ్మవారి సారెకు భక్తిశ్రద్ధలతో నీరు వార పోశారు. మేళ తాళాలు, కనక తప్పెట్లు, డీజే సౌండ్లతో ఉత్సాహంగా ఊరేగింపు సాగింది. ఈ కార్యక్రమంలో రుద్రు వారి దేవర కమిటీ అధ్యక్షులు రుద్రు శ్రీనివాసరావు, కమిటీ ప్రతినిధులు రుద్రు వీర రాఘవులు, సాంబయ్య, శివ, పెద్ద సాంబయ్య, వీరయ్య, వంకాయల శ్రీను తదితరులు పాల్గొన్నారు.
Navuluru
Gangamma Temple
Sare Mahotsavam
Shravana Masam
Traditional Festival
గంగమ్మ తల్లి
శ్రావణ మాసం
సారె మహోత్సవం
Scroll for the next article