News15th Jul 09:47 AMSunil Byrisetty1 min read
మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభంకి అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు
మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభంకి అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు జరగనున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఫోన్లో మాట్లాడుకొని నిర్ణయం తీసుకున్నారు. ఈ మే
మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభంకి అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు జరగనున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఫోన్లో మాట్లాడుకొని నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు అధికారులకు సీఎం ఆదేశాలు జారీ చేశారు. మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభంకి అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నిర్ణయం తీసుకున్నారు.
ఉదయాన్నే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఫోన్లో మాట్లాడుకున్నారు. నాలుగుసార్లు శాసన సభ్యుడిగా, ఒకసారి లోక్ సభ సభ్యుడిగా, రాష్ట్ర క్యాబినెట్ మంత్రి ముద్రగడ పద్మనాభం సేవలందించారని... అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో చేపట్టాలని నిర్ణయించారు. ఈ మేరకు అధికారులకు ఆదేశాలు ఇచ్చారు.