News27th Oct 04:40 PMSunil Byrisetty1 min read
నిష్పక్షపాతంగా ఎన్నికల వ్యయాల పర్యవేక్షణ
జిల్లాలో స్థానిక ఎన్నికలకు సంబంధించి అభ్యర్థుల వ్యయాల పర్యవేక్షణలో అధికారులు నిష్పక్షపాతంగా, పారదర్శకంగా వ్యవహరించాలని ఎన్నికల వ్యయ జిల్లా పరిశీలకులు బి.విజయ్ కుమార్ సూచించారు.
జిల్లాలో స్థానిక ఎన్నికలకు సంబంధించి అభ్యర్థుల వ్యయాల పర్యవేక్షణలో అధికారులు నిష్పక్షపాతంగా, పారదర్శకంగా వ్యవహరించాలని ఎన్నికల వ్యయ జిల్లా పరిశీలకులు బి.విజయ్ కుమార్ సూచించారు. ఎన్నికల నిబంధనలకు అనుగుణంగా నిబద్ధతతో విధులు నిర్వర్తిస్తూ, ప్రతి అంశంలోనూ జవాబుదారీతనాన్ని పాటించాలని తెలిపారు.
మంగళవారం కలెక్టరేట్ శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో జిల్లా వ్యయ పరిశీలకులు బి.విజయ్ కుమార్.. సహాయ వ్యయ పరిశీలకులతో పాటు కమాండ్ కంట్రోల్ రూమ్, ఎంసీసీ, ఎంసీఎంసీ, అకౌంటింగ్ టీమ్, ఎక్సైజ్ తదితర విభాగాలు, శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. వివిధ కమిటీల పనితీరును పరిశీలించారు. ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్స్ (ఎఫ్‌ఎస్‌టీ), స్టాటిక్ సర్వైలెన్స్ టీమ్స్ (ఎస్‌ఎస్‌టీ), వీడియో సర్వైలెన్స్ టీమ్స్ (వీఎస్‌టీ) తదితర బృందాల మధ్య సమన్వయంపైనా దిశానిర్దేశం చేశారు. ఎన్నికల వ్యయాలకు సంబంధించిన అంశాలను నిరంతరం పర్యవేక్షిస్తూ, విధుల నిర్వహణలో ప్రతి అడుగులోనూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు.