News2nd Nov 04:32 PMSunil Byrisetty1 min read

తుఫాను ముప్పు వేళ అప్రమత్తంగా ఉండాలి

రాష్ట్రంలో ముంచుకొస్తున్న తుఫాను ప్రభావంతో జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున, ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా అన్ని శాఖల అధికారులు పూర్తి సంసిద్ధతతో పనిచేయా

తుఫాను ముప్పు వేళ అప్రమత్తంగా ఉండాలి
రాష్ట్రంలో ముంచుకొస్తున్న తుఫాను ప్రభావంతో జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున, ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా అన్ని శాఖల అధికారులు పూర్తి సంసిద్ధతతో పనిచేయాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ ఆదేశించారు. రెవెన్యూ, మున్సిపల్, పోలీస్, వైద్య, విద్యుత్, ఇరిగేషన్ తదితర లైన్ డిపార్ట్‌మెంట్ అధికారులతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. కొండ ప్రాంతాలు, లోతట్టు ప్రాంతాలు, పూరిళ్లులో నివసిస్తున్న ప్రజలను వెంటనే సురక్షిత ప్రాంతాల్లోని పునరావాస కేంద్రాలకు తరలించాలన్నారు. క్యాంపుల్లో ఆశ్రయం పొందుతున్న వారికి నేటి రాత్రి నుంచే భోజనం, తాగునీరు, వసతి వంటి కనీస సదుపాయాలు ఏర్పాటు చేయాలన్నారు. గర్భిణులు ముఖ్యంగా ప్రసవానికి సమీపంలో ఉన్నవారు, బాలింతలు, వృద్ధులు, చిన్నారులను ముందుగానే సమీప ఆరోగ్య కేంద్రాలు లేదా సురక్షిత ప్రాంతాలకు తరలించాలన్నారు. మండల కేంద్రాల్లో, కలెక్టరేట్‌లో 24/7 కాల్ సెంటర్లు, అత్యవసర స్పందన కేంద్రాలు నిరంతరం పనిచేయాలన్నారు. గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉంటూ, వర్షం, చెట్లు కూలడం, ముంపు వంటి వివరాలపై ప్రతి గంటకూ సమాచారాన్ని ఉన్నతాధికారులకు చేరవేయాలన్నారు.
Scroll for the next article