Crime10th Oct 03:28 PMSunil Byrisetty1 min read

పాత ఫోన్లకు ప్లాస్టిక్‌ సామాన్లా.. జర జాగ్రత్త..!

పాడైపోయిన పాత మొబైల్‌ ఫోన్లకు ప్లాస్టిక్‌ సామాన్లు ఇస్తామంటూ ఎవరైనా వస్తే తొందరపడొద్దు. మీ ఇంట్లోని పాత మొబైల్‌ ఫోన్లను అమ్మేయకండి. ఇలా చేయడం వల్ల పలు చిక్కుల్లో పడతారని అధికారులు

పాత ఫోన్లకు ప్లాస్టిక్‌ సామాన్లా.. జర జాగ్రత్త..!
పాడైపోయిన పాత మొబైల్‌ ఫోన్లకు ప్లాస్టిక్‌ సామాన్లు ఇస్తామంటూ ఎవరైనా వస్తే తొందరపడొద్దు. మీ ఇంట్లోని పాత మొబైల్‌ ఫోన్లను అమ్మేయకండి. ఇలా చేయడం వల్ల పలు చిక్కుల్లో పడతారని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇలా తీసుకెళ్లిన పాత మొబైల్స్‌ నేరుగా సైబర్‌ నేరగాళ్ల చేతుల్లోకి వెళ్లిపోతున్నాయి. ఆ నేరగాళ్లు ఈ మొబైల్‌ ఫోన్ల ఐఈఎంఐ నంబర్లు, మదర్‌ బోర్డు, సాఫ్ట్‌వేర్‌ సేకరించి, మరమ్మతులు చేస్తారు. ఆ తర్వాత ఆ ఫోన్ల ద్వారా సైబర్‌ నేరాలకు పాల్పడుతారు. ఇలా వచ్చిన డబ్బులో నుంచి ఈ మొబైల్‌ ఫోన్లను సేకరించి తెచ్చిన వారికి కమీషన్‌ ఇచ్చి దందా సాగిస్తున్నారు. ఆ నేరగాళ్లు ఈ మొబైల్‌ ఫోన్ల ఐఈఎంఐ నంబర్లు, మదర్‌ బోర్డు, సాఫ్ట్‌వేర్‌ సేకరించి, మరమ్మతులు చేస్తారు. ఆ తర్వాత ఆ ఫోన్ల ద్వారా సైబర్‌ నేరాలకు పాల్పడతారు. సైబర్ పోలీసుల దర్యాప్తులో ఫోన్ యజమానిని గుర్తిస్తే, చిక్కుల్లో పడాల్సిందేనని సూచిస్తున్నారు.
Andhra Pradesh
Cybercrime
Old Mobile Phones
IMEI
Phone Recycling
Consumer Alert
Cyber Police
Mobile Fraud
Electronics Disposal
Public Safety
ఫోన్ రీసైక్లింగ్
వినియోగదారుల హెచ్చరిక
Scroll for the next article