Telangana1st Sep 05:28 PMSunil Byrisetty1 min read
అభివృద్ధికి ఉపయోగపడుతున్న నాటి స్నేహం
టీడీపిలో పరిచయాలు, స్నేహాలు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉపయోగపడుతున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి అభ్యర్ధన మేరకు పౌరవిమానయానశాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు వరంగల్‌లో రెండేళ్ళలో అంతర్జా
టీడీపిలో పరిచయాలు, స్నేహాలు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉపయోగపడుతున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి అభ్యర్ధన మేరకు పౌరవిమానయానశాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు వరంగల్‌లో రెండేళ్ళలో అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. తాజాగా గతంలో టీడీపిలో పనిచేసిన తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు రామ్మోహన్ ని కలిసి, కొత్తగూడెంలో విమానాశ్రయం ఏర్పాటుకు సహకరించాల్సిందిగా అభ్యర్ధించారు. దానికి ఆయన సానుకూలంగా స్పందించారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంపిక చేసిన ప్రదేశాలను పరిశీలించేందుకు ఈ నెల 7న కేంద్ర బృందాన్ని పంపిస్తానని రామ్మోహన్ నాయుడు తెలంగాణ మంత్రి తుమ్మలకి హామీ ఇచ్చారు. ఆ బృందం నివేదిక అనుకూలంగా ఉంటే, వీలైనంత త్వరగా అక్కడ విమానాశ్రయం ఏర్పాటుకి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.