Mobiles22nd May 05:09 PMSunil Byrisetty1 min read
వన్‌ప్లస్ ప్రియులకు గుడ్ న్యూస్.. 27న కొత్త ఫోన్లు
ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ వన్ ప్లస్ గుడ్ న్యూస్ చెప్పింది. ఈనెల 27న వన్‌ప్లస్ ఎస్ సిరీస్‌లో మరో రెండు కొత్త ఫోన్లను విడుదల చేయనుంది. అలాగే, టీడబ్ల్యూఎస్ ఇయర్‌బడ్స్‌నూ లాంచ్
ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ వన్ ప్లస్ గుడ్ న్యూస్ చెప్పింది.
ఈనెల 27న వన్‌ప్లస్ ఎస్ సిరీస్‌లో మరో రెండు కొత్త ఫోన్లను విడుదల చేయనుంది.
అలాగే, టీడబ్ల్యూఎస్ ఇయర్‌బడ్స్‌నూ లాంచ్ చేయనుంది.
వన్‌ప్లస్ ఏస్ 5 అల్ట్రా ఎడిషన్, వన్‌ప్లస్ ఏస్ 5 రేసింగ్ ఎడిషన్ పేర్లతో రాబోయే ఈ ఫోన్ల ఫీచర్లు, ధర వివరాలు చూద్దాం.
వన్‌ప్లస్ ఏస్ 5 అల్ట్రా ఎడిషన్
గేమింగ్ ప్రియుల కోసం వన్‌ప్లస్ ప్రత్యేకంగా రూపొందించిన ఈ ఫోన్ బిగ్ డిస్‌ప్లేతో రాబోతోంది.
ఈ ఫోన్‌లో మిడియాటెక్ డైమెన్సిటీ 9400+ ప్రాసెసర్, ఫెంగ్చి గేమింగ్ కోర్, లింగ్జీ టచ్ చిప్, గేమింగ్ వై-ఫై చిప్ G1 వంటి ఫీచర్లు ఉండబోతున్నాయి. ఈ ఫోన్ ఫాంటమ్ బ్లాక్, బ్రీజ్ బ్లూ, టైటానియం గోల్డ్ రంగుల్లో అందుబాటులోకి రానుంది. ఈ మోడల్ 12GB + 256GB, 16GB + 256GB, 12GB + 512GB, 16GB + 512GB, 16GB + 1TB స్టోరేజ్ ఆప్షన్లతో ఉండనుంది.