Education25th Apr 01:19 PMSunil Byrisetty1 min read
పదిలో అద్భుత ప్రదర్శన.. ఎకరం పొలం గిఫ్ట్!
పదో తరగతి పరీక్షల్లో మార్కులు బాగా తెచ్చుకున్న నిరుపేద విద్యార్థినికి పల్నాడు జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు ప్రోత్సాహం అందించాలని నిర్ణయించారు. ప్రతిభావంతులను ప్రోత్సహించడం, పేద కుటుం
పదో తరగతి పరీక్షల్లో మార్కులు బాగా తెచ్చుకున్న నిరుపేద విద్యార్థినికి పల్నాడు జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు ప్రోత్సాహం అందించాలని నిర్ణయించారు.
ప్రతిభావంతులను ప్రోత్సహించడం, పేద కుటుంబాలను ఆదుకోవడమే ధ్యేయంగా ప్రభుత్వం తరఫున ఎకరం భూమిని మంజూరు చేశారు.
తాజాగా విడుదలైన పదో తరగతి ఫలితాల్లో నాదెండ్ల మండలం చిరుమామిళ్ల జడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థిని అమూల్య 600కు 593 మార్కులు సాధించింది.
ఈ సందర్భంగా అమూల్యను జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు అభినందించి, వారి పేదరికం గురించి తెలుసుకుని చలించారు.
అమూల్య తల్లిదండ్రులు అనిల్, రూతమ్మ కూలి పనులు చేసుకునే నిరుపేదలని, వారి కుటుంబంలో మరో ముగ్గురు ఆడపిల్లలు చదువుకుంటున్నారని తెలుసుకుని అభినందించారు. భూమి లేని నిరుపేదల పథకం కింద విద్యార్థిని కుటుంబానికి ఎకరం పొలం మంజూరు చేస్తున్నట్లు కలెక్టర్ అరుణ్ బాబు ప్రకటించారు.