Telangana11th Aug 11:24 AMSunil Byrisetty1 min read

తెలంగాణలో కోటి ఓట్లు గల్లంతు?

ఎస్ఐఆర్ లో భాగంగా ఓట్ల పరిశీలనలో తెలంగాణలో భారీగా ఓట్లు గల్లంతవుతున్నట్లు తెలుస్తోంది. తెలంగాణలో మొత్తం 3.38 కోట్ల ఓటర్లలో దాదాపు 1.31 కోట్ల మంది ఓటర్ల డేటా సమగ్ర పరిశీలన పరిధిలోకి

తెలంగాణలో కోటి ఓట్లు గల్లంతు?
ఎస్ఐఆర్ లో భాగంగా ఓట్ల పరిశీలనలో తెలంగాణలో భారీగా ఓట్లు గల్లంతవుతున్నట్లు తెలుస్తోంది. తెలంగాణలో మొత్తం 3.38 కోట్ల ఓటర్లలో దాదాపు 1.31 కోట్ల మంది ఓటర్ల డేటా సమగ్ర పరిశీలన పరిధిలోకివచ్చింది. వీరిలో కోటి మంది ఓట్లు గల్లంతయ్యే అవకాశం ఉంది. రాష్ట్రవ్యాప్తంగా 72.2 లక్షల మంది ఎన్యూమరేషన్ ఫారమ్‌లను సమర్పించలేదు. అంటే వీరి ఓట్లు ఆటోమేటిక్‌గా తీసేస్తారు. మరో 61.1 లక్షల మంది సమాచారంలో వ్యత్యాసాలు ఉన్నట్లు గుర్తించారు. వీరు పత్రాలు సమర్పించకపోతే ఓటు కోల్పోతారు. అలాగే 2.8 లక్షల మంది ABSENT, SHIFTED, DEAD కేటగిరీలో ఉన్నారు. వీరి ఓట్లు పోతాయి. ఎలా చూసినా కనీసం కోటి ఓట్లు గల్లంతు అవుతాయి. అంటే మొత్తం ఓటర్లు రెండున్నర కోట్ల లోపే ఉంటారు.
Telangana
Voter List
SIR
Special Intensive Revision
Voter Verification
Electoral Roll
Voter Deletion
Election Commission
ఓటర్ డేటా
ఎన్నికల సంస్కరణలు
ఓటు హక్కు
ఓటర్ నమోదు
ఎన్నికల అప్‌డేట్స్
Scroll for the next article