News9th Oct 04:42 PMSunil Byrisetty1 min read

వన్ నేషన్ - వన్ ట్యాక్స్ అమలు అనేది చారిత్రాత్మక నిర్ణయం..

అనంతపురం నగరంలో సూపర్ జిఎస్టీ - సూపర్ సేవింగ్స్ లో భాగంగా అధికారులు, డీలర్లతో నిర్వహించిన అవగాహన సదస్సులో ఆర్థిక శాఖ మంత్ పయ్యావుల కేశవ్, అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ పాల్గొన

వన్ నేషన్ - వన్ ట్యాక్స్ అమలు అనేది చారిత్రాత్మక నిర్ణయం..
అనంతపురం నగరంలో సూపర్ జిఎస్టీ - సూపర్ సేవింగ్స్ లో భాగంగా అధికారులు, డీలర్లతో నిర్వహించిన అవగాహన సదస్సులో ఆర్థిక శాఖ మంత్ పయ్యావుల కేశవ్, అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.పయ్యావుల మాట్లాడుతూ గత ప్రభుత్వాల్లో ఏ వర్గానికి, ఏ సెక్టార్లో ఎక్కువ ఆదాయం వస్తుందో వాటి నుంచి ప్రభుత్వం పన్నులు వసూలు చేయడం జరిగిందన్నారు. పురాణ కాలంలోని చాణక్యుడి కాలం నుంచి ఇదే పద్ధతి ఉండేదన్నారు. ఎన్నికల సమయంలో మామూలుగా ఎన్నికల తాయిలాలు ఉంటాయని, కానీ ఎన్డీఏ ప్రభుత్వం ప్రజలకు మేలు కలిగించే పలు కార్యక్రమాలు అమలు చేస్తున్నామన్నారు. రాష్ట్ర ప్రతినిధిగా జీఎస్టీ సంస్కరణల అమలుకు జరిగే సమావేశాల్లో తాను పాల్గొనడం ఎంతో సంతోష దాయకం అని పేర్కొన్నారు. వన్ నేషన్ - వన్ ట్యాక్స్ అమలు అనేది చారిత్రాత్మక నిర్ణయం అన్నారు. ప్రజలకు మేలు చేయాలని తపన ఉండే ఎన్డీఏ ప్రభుత్వం అందించిన ఫలాలకు ఒక గొప్ప ఉదాహరణ జీఎస్టీ 2.ఓ అమలు అని తెలిపారు.
Andhra Pradesh
GST
One Nation One Tax
Super GST
Super Savings
Anantapur
Payyavula Keshav
Ambika Lakshmi Narayana
ఆర్థిక శాఖ మంత్రి
అనంతపురం
అవగాహన సదస్సు
వన్ నేషన్ వన్ ట్యాక్స్
ఎన్డీఏ ప్రభుత్వం
పయ్యావుల కేశవ్
Scroll for the next article