News15th Aug 01:59 PMSunil Byrisetty1 min read

స్త్రీశక్తికి ఏడాది.. కోట్లు దాటిన ప్రయాణాలు

రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం ప్రారంభించి ఏడాది పూర్తయింది. ఈ నేపథ్యంలో నిర్వహించిన 'స్త్రీ శక్తికి ఏడాది- రెట్టింపైన ఆత్మగౌరవం' కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొన్

స్త్రీశక్తికి ఏడాది.. కోట్లు దాటిన ప్రయాణాలు
రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం ప్రారంభించి ఏడాది పూర్తయింది. ఈ నేపథ్యంలో నిర్వహించిన 'స్త్రీ శక్తికి ఏడాది- రెట్టింపైన ఆత్మగౌరవం' కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొన్నారు. 'స్త్రీ శక్తి' పథకం అమలు తీరు తెన్నులను మహిళలను అడిగి తెలుసుకున్నారు. మహిళల కుటుంబ స్థితిగతులపై ఆరా తీశారు. 'స్త్రీ శక్తి' పథకం ద్వారా తనకు నెలకు రూ.4 వేలు ఆదా అవుతున్నాయని మత్స్యకార మహిళ తెలిపారు. మత్స్యకార మహిళ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. 'స్త్రీ శక్తి' పథకం వల్ల తనకు నెలకు రూ.1,500 ఆదా అవుతుందని నంద్యాల నుంచి వచ్చిన ముస్లిం మహిళ తెలిపారు.
Andhra Pradesh Government
Stree Shakti Scheme
Free Bus Travel
Women Welfare
Chandrababu Naidu
మహిళా సాధికారత
ప్రజా రవాణా
ఉచిత బస్సు సేవలు
మహిళల పొదుపు
సామాజిక సంక్షేమం
Scroll for the next article