Politics24th Jun 12:29 PMSunil Byrisetty1 min read

సుపరిపాలన - తొలి అడుగులో మంత్రి లోకేష్ ఆత్మీయ పలకరింపు

రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయిన సందర్భంగా సుపరిపాలన - తొలి అడుగు పేరిట నిర్వహించిన కార్యక్రమానికి రాష్ట్రం నలుమూలల నుంచి అధికారులు, ప్రజాప్రతినిధులు హాజ

సుపరిపాలన - తొలి అడుగులో మంత్రి లోకేష్ ఆత్మీయ పలకరింపు
రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయిన సందర్భంగా సుపరిపాలన - తొలి అడుగు పేరిట నిర్వహించిన కార్యక్రమానికి రాష్ట్రం నలుమూలల నుంచి అధికారులు, ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి నారా లోకేష్ ప్రతి ఒక్క టేబుల్ దగ్గరకు వెళ్లి ఆప్యాయంగా పలకరించారు. అధికారులు, ప్రజాప్రతినిధులు కూటమి ప్రభుత్వ విజయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కోరారు. రాష్ట్రంలో ప్రజలంతా గత ఏడాది కాలంగా స్వేచ్చాయుత వాతావణంలో జీవిస్తున్నారని చెప్పారు. ప్రజా ప్రభుత్వంలో అందరూ ప్రశాంతంగా జీవించాలన్నదే తమ లక్ష్యమని లోకేష్ చెప్పారు. దీంతో గత ప్రభుత్వంలో వైసీపీ అధినేతను కలిసే అవకాశం కూడా ఉండేది కాదని, ఇప్పుడు ఏకంగా ముఖ్యమంత్రి తనయుడు, మంత్రి అయినా లోకేష్ స్వయంగా వచ్చి తమను పలకరిస్తున్నారని నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Andhra Pradesh news
first step rebuilding ap
TDP
nara lokesh
Chandra Babu
suparipalana
సుపరిపాలన లో తొలిఅడుగు
Scroll for the next article