Politics27th Nov 01:31 PMSunil Byrisetty1 min read

మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై కోటి సంతకాల సేకరణ

వైసిపి అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపుమేరకు, మాజీ మంత్రి కొడాలి నాని ఆధ్వర్యంలో గుడివాడ ముబారక్ సెంటర్లో కోటి సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు. మెడికల్ కాలేజీల ప్రైవేట

మెడికల్  కాలేజీల ప్రైవేటీకరణపై కోటి సంతకాల సేకరణ
వైసిపి అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపుమేరకు, మాజీ మంత్రి కొడాలి నాని ఆధ్వర్యంలో గుడివాడ ముబారక్ సెంటర్లో కోటి సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను అడ్డుకునేందుకు కోటి సంతకాల సేకరణ ప్రజా ఉద్యమానికి గుడివాడ నియోజకవర్గంలో ప్రజల నుంచి పెద్ద ఎత్తున స్పందన వస్తుందని పట్టణ అధ్యక్షుడు గొర్ల శ్రీను అన్నారు. వైయస్సార్ సిపి కృష్ణాజిల్లా మైనార్టీ అధ్యక్షులు మహమ్మద్ ఖాసిం (అబు), ఎస్.కె అలీ సాహెబ్(బాజీ) ఆధ్వర్యంలో సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టారు. నాయకులు మాట్లాడుతూ కొత్త మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరిస్తూ కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై వెనక్కి తగ్గేదాకా పోరాడుతామన్నారు. పేద విద్యార్థుల కోసం జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజీలకు శ్రీకారం చేయగా,7 మెడికల్ కాలేజీలు నిర్మాణం పూర్తి చేసుకున్నయని, మరో 10 కాలేజీలు నిర్మాణంలో ఉన్నాయని కూటమి ప్రభుత్వం చేతకానితనం వల్లే 10 మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ చేస్తుందన్నారు. ఎన్నికల హామీలను టీడీపీ ప్రభుత్వం తుంగలో తొక్కిందని ప్రజలు నేడు తీవ్ర ఇబ్బందులతో సతమతమవుతున్నారని, ముఖ్యంగా రైతుల కష్టాలు వర్ణనాతీతంగా ఉన్నాయని తెలిపారు.
Andhra Pradesh politics
Medical college privatization
One crore signatures campaign
Gudivada
Kodali Nani
YSRCP
Jagan Mohan Reddy
Public movement
ఉద్యమం
విద్యా రంగం
టీడీపీ ప్రభుత్వం
కృష్ణా జిల్లా
మైనార్టీ నాయకులు
Scroll for the next article