Mobiles6th Jun 12:26 PMSunil Byrisetty1 min read
సూపర్ ఫీచర్లతో.. వన్‌ప్లస్ 13ఎస్
ప్రముఖ మొబైల్ కంపెనీ వన్ ప్లస్ తన మొట్టమొదటి కాంపాక్ట్ ఫోన్‌ను భారత్‌లో లాంచ్ చేసింది. వన్‌ప్లస్ 13S పేరిట ఈ మొబైల్స్‌ను తీసుకొచ్చింది. ఏఐ ఫీచర్లు, ఆకర్షణీయమైన డిజైన్, శక్తిమ
ప్రముఖ మొబైల్ కంపెనీ వన్ ప్లస్ తన మొట్టమొదటి కాంపాక్ట్ ఫోన్‌ను భారత్‌లో లాంచ్ చేసింది. వన్‌ప్లస్ 13S పేరిట ఈ మొబైల్స్‌ను తీసుకొచ్చింది. ఏఐ ఫీచర్లు, ఆకర్షణీయమైన డిజైన్, శక్తిమంతమైన బ్యాటరీతో దీన్ని విడుదల చేసింది. 6.32 అంగుళాల 1.5కె ఎల్‌టీపీఓ డిస్‌ప్లేతో ఈ వన్‌ప్లస్ 13ఎస్ కొత్త మొబైల్ వస్తోంది. 120Hz రిఫ్రెష్ రేటు, 1,600 నిట్స్ పీక్‌బ్రైట్ నెస్ కలిగినఈ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్‌తో ఆండ్రాయిడ్ 15 ఆధారంగా పనిచేస్తుంది. 50 ఎంపీ సోనీ LYT-700 ప్రధాన కెమెరా, 50 ఎంపీ అల్ట్రావైడ్ కెమెరా, సెల్ఫీ కోసం 32 ఎంపీ కెమెరాను అమర్చారు. 5,850mAh బ్యాటరీతో వస్తున్న ఈ మొబైల్ 80W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. బ్లూటూత్ 6.0, యూఎస్‌బీ టైప్-సీ పోర్ట్ కనెక్టివిటీ ఫీచర్లు ఉన్నాయి. నేటినుంచి ప్రీ బుకింగ్‌లు, జూన్ 12 నుంచి విక్రయాలు ప్రారంభమవుతాయని సంస్థ పేర్కొంది. 12జీబీ+256జీబీ వేరియంట్ ధర రూ.54,999, 12జీబీ +512జీబీ వేరియంట్ ధర రూ.59,999గా నిర్ణయించింది. గ్రీన్ సిల్క్, బ్లాక్ వెల్‌వెట్ రంగుల్లో లభించే ఈ మొబైల్ లాంచింగ్ ఆఫర్‌లో భాగంగా ఎస్‌బీఐ కార్డు సాయంతో కొనుగోలు చేసిన వారికి రూ.5వేల తగ్గింపు లభిస్తుంది.