Mobiles2nd Nov 02:25 PMSunil Byrisetty1 min read
Oneplus 15 వచ్చేస్తోంది..
వన్ ప్లస్, తమ సరికొత్త ఫ్లాగ్ షిప్ స్మార్ట్ ఫోన్ అయిన OnePlus 15 ని వచ్చే నెలలో గ్లోబల్ మార్కెట్ లో విడుదల కానున్నట్లు తెలుస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 8 ఎలై
వన్ ప్లస్, తమ సరికొత్త ఫ్లాగ్ షిప్ స్మార్ట్ ఫోన్ అయిన OnePlus 15 ని వచ్చే నెలలో గ్లోబల్ మార్కెట్ లో విడుదల కానున్నట్లు తెలుస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 ప్రాసెసర్, 50MP ట్రిపుల్ కెమెరా, 7300 mAh భారీ బ్యాటరీ, 120W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, ఆండ్రాయిడ్ 16 తో రానున్నట్లు తెలుస్తుంది. చైనాకి చెందిన ప్రీమియం స్మార్ట్ ఫోన్స్ తయారీ బ్రాండ్ అయిన వన్ ప్లస్, తమ సరికొత్త ప్రీమియం ఫ్లాగ్ షిప్ స్మార్ట్ ఫోన్ అయిన OnePlus 15 ని వచ్చే నెలలో గ్లోబల్ మార్కెట్ లోకి విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ గత ఏడాది విడుదల అయిన OnePlus 14 కి అప్ డేటెడ్ వెర్షన్ గా రానుంది. ఈ స్మార్ట్ ఫోన్ క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 ప్రాసెసర్ తో పాటు 50 మెగా పిక్సెల్ మెయిన్ కెమెరా, 7300 ఎంఏహెచ్ బ్యాటరీ, 120 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, ఆండ్రాయిడ్ 16 ఆపరేటింగ్ సిస్టంతో అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తుంది.
ఈ స్మార్ట్ ఫోన్ ప్రారంభ ధర సుమారు రూ. 70,000 నుంచి రూ. 75,000 లుగా ఉండే అవకాశం ఉందని కూడా తెలుస్తుంది. ఇక ఎప్పటి మాదిరిగానే ఈ స్మార్ట్ ఫోన్ కూడా దేశంలోని ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్ ఫారం అయిన అమెజాన్ తో పాటు వన్ ప్లస్ ఇండియా అధికారిక వెబ్ సైట్ లో సేల్ కి అందుబాటులో ఉంటుంది.