Mobiles23rd Dec 12:39 PMSunil Byrisetty1 min read
వన్ ప్లస్ నుంచి మరొక హై ఎండ్ స్మార్ట్ ఫోన్ 15T
చైనాకి చెందిన ప్రీమియం స్మార్ట్ ఫోన్స్ తయారీ బ్రాండ్ అయిన OnePlus, మరొక సరికొత్త ప్రీమియం 5G స్మార్ట్ ఫోన్ అయిన OnePlus 15T ని త్వరలో భారత మార్కెట్ లోకి విడుదల చేయనున్నట్లు తెలుస్త
చైనాకి చెందిన ప్రీమియం స్మార్ట్ ఫోన్స్ తయారీ బ్రాండ్ అయిన OnePlus, మరొక సరికొత్త ప్రీమియం 5G స్మార్ట్ ఫోన్ అయిన OnePlus 15T ని త్వరలో భారత మార్కెట్ లోకి విడుదల చేయనున్నట్లు తెలుస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ గత ఏడాది విడుదలైన OnePlus 15T కి అప్ డేటెడ్ వెర్షన్ గా రానుంది. ఇక ఈ స్మార్ట్ ఫోన్ ఇంకా విడుదల కాకముందే దీనికి సంబంధించిన ఫీచర్స్ కొన్ని ఆన్ లైన్ ప్లాట్ ఫారంలలో లీక్ అవ్వడం జరిగింది. వీటి ప్రకారం, OnePlus 15T స్మార్ట్ ఫోన్ క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 ప్రాసెసర్ తో పాటు 50 మెగా పిక్సెల్ మెయిన్ కెమెరా, 7000 ఎంఏహెచ్ బ్యాటరీ, 100 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, ఆండ్రాయిడ్ 16 ఆపరేటింగ్ సిస్టంతో అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ ప్రారంభ ధర సుమారు రూ. 42,999 లుగా ఉండే అవకాశం ఉందని కూడా లీకుల ద్వారా తెలుస్తుంది.
6.3 ఇంచ్ 1.5k OLED డిస్ ప్లే
165 హెడ్జ్ రిఫ్రెష్ రేట్
HDR 10 + సపోర్ట్
1440 x 3168 పిక్సల్స్ రిజల్యూషన్
IP68 / IP69 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టన్స్
క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 ప్రాసెసర్
ఆక్సిజన్ ఓఎస్ 16 ఆధారిత ఆండ్రాయిడ్ 16 ఆపరేటింగ్ సిస్టం
12 జీబీ ర్యామ్ + 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్, 12 జీబీ ర్యామ్ + 512 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ వేరియంట్స్ అందుబాటులోకి రానున్నాయి.