Mobiles25th Dec 01:25 PMSunil Byrisetty1 min read
9,000mAh బ్యాటరీ కా బాప్.. వన్‌ప్లస్ కొత్త ఫోన్
వన్‌ప్లస్ భారీ బ్యాటరీతో మరో కొత్త ఫోన్‌పై పని చేస్తోందన్న సమాచారం టెక్ ప్రపంచంలో ఆసక్తిని పెంచుతోంది. ఈ ఫోన్‌లోని ప్రధాన హైలైట్ 9,000mAh బ్యాటరీ. ప్రస్తుతం మార్కెట్‌లో ఉన్న చాలా ఫ
వన్‌ప్లస్ భారీ బ్యాటరీతో మరో కొత్త ఫోన్‌పై పని చేస్తోందన్న సమాచారం టెక్ ప్రపంచంలో ఆసక్తిని పెంచుతోంది. ఈ ఫోన్‌లోని ప్రధాన హైలైట్ 9,000mAh బ్యాటరీ. ప్రస్తుతం మార్కెట్‌లో ఉన్న చాలా ఫోన్లలో 5,000mAh లేదా 5,500mAh బ్యాటరీలే కనిపిస్తాయి. కానీ వన్‌ప్లస్ ఈ ఫోన్లలో భారీ బ్యాటరీ ఇవ్వడం వల్ల, ఒకసారి ఛార్జ్ చేస్తే రెండు రోజుల వరకు నార్మల్ యూజ్‌లో సులభంగా నడిచే ఛాన్స్ ఉంది. హెవీ యూజ్ చేసినా బ్యాటరీ గురించి టెన్షన్ తగ్గే అవకాశం ఉంది. దీనికి తోడు 80W ఫాస్ట్ వైర్డ్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంటుందని రిపోర్టులు చెబుతున్నాయి. ఈ కొత్త వన్‌ప్లస్ ఫోన్‌లో 1.5K రిజల్యూషన్ డిస్‌ప్లే ఉండొచ్చని సమాచారం. రిఫ్రెష్ రేట్ 165Hz వరకు ఉండే అవకాశం ఉంది. గేమింగ్ చేస్తూ స్క్రోలింగ్ చేసినప్పుడు, సోషల్ మీడియా వాడేటప్పుడు చాలా స్మూత్ అనుభవం ఇవ్వగలదు. ఇక్కడ ఎల్టీపీఎస్ టెక్నాలజీ వాడే ఛాన్స్ ఉంది. ఎల్టీపీఓ లాగా పూర్తిగా డైనమిక్ కాకపోయినా, వన్‌ప్లస్ ఆప్టిమైజేషన్ వల్ల యూజర్‌కు పెద్ద తేడా అనిపించకపోవచ్చు. మార్కెట్ ట్రెండ్స్‌ను బట్టి చూస్తే ఇండియాలో ఈ ఫోన్ ధర సుమారుగా రూ.35,000 నుంచి 40,000 మధ్య ఉండొచ్చు.