Mobiles23rd May 11:00 AMSunil Byrisetty1 min read

భారీ బ్యాటరీ, గొప్ప డిస్‌ప్లేతో వన్‌ప్లస్‌ ప్యాడ్‌ 3.. ఎప్పుడంటే?

భారీ బ్యాటరీ, పెద్ద డిస్‌ప్లేతో వన్‌ప్లస్‌ ప్యాడ్‌ 3 ట్యాబ్లెట్‌ రాబోతోంది. జూన్ 5 వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. స్నాప్‌డ్రాగన్‌ 8 ఇలైట్‌ చిప్‌సెట్‌తో పనిచేసే ఈ ట్యాబ్లె

భారీ బ్యాటరీ, గొప్ప డిస్‌ప్లేతో వన్‌ప్లస్‌ ప్యాడ్‌ 3.. ఎప్పుడంటే?
భారీ బ్యాటరీ, పెద్ద డిస్‌ప్లేతో వన్‌ప్లస్‌ ప్యాడ్‌ 3 ట్యాబ్లెట్‌ రాబోతోంది. జూన్ 5 వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. స్నాప్‌డ్రాగన్‌ 8 ఇలైట్‌ చిప్‌సెట్‌తో పనిచేసే ఈ ట్యాబ్లెట్‌తోపాటు కీబోర్డు, స్టైలస్‌ కూడా ఇవ్వనున్నారు. కేవలం 5.97mm థిక్‌నెస్‌తో స్లిమ్ స్లీక్‌ మెటల్‌ యూనిబాడీ డిజైన్‌తో రానుంది. డీప్‌ సీ బ్లూ కలర్ ఆప్షన్‌లో అందుబాటులోకి రానున్న ఈ ట్యాబ్లెట్‌ 144Hz రీఫ్రెష్‌ రేట్‌తో 13.2 అంగుళాల 2K ఎల్సీడీ డిస్‌ప్లేను కలిగి ఉంటుందని తెలుస్తోంది. గరిష్ఠంగా 16GB ర్యామ్‌ను సపోర్టు చేస్తుందని తెలుస్తోంది. 12140mAh భారీ బ్యాటరీతో వెనుక వైపు 13MP కెమెరా, సెల్ఫీ కెమెరా ఉంటాయి. ఈ ట్యాబ్లెట్‌ 67W SuperVOOC ఛార్జింగ్‌ సపోర్టుతో పని చేస్తుందని తెలుస్తోంది. ఈ ట్యాబ్లెట్‌ 8 స్పీకర్‌లను, డాల్బీ అట్మాస్‌ సపోర్టును కలిగి ఉంటుందని తెలుస్తోంది.
OnePlus Pad 3
flagship Snapdragon 8 Elite chipset
వన్‌ప్లస్‌ ప్యాడ్‌ 3 ట్యాబ్లెట్‌
స్నాప్‌డ్రాగన్‌ 8 ఇలైట్‌ చిప్‌సెట్‌
డాల్బీ అట్మాస్‌ సపోర్టు
Scroll for the next article