News5th Sep 06:10 PMSunil Byrisetty1 min read
ఏ పనికైనా ఏడాదే టార్గెట్.. ఎంపీ పుట్టా
ఎంపీ లాడ్స్ నిధులతో చేపట్టిన పనుల పురోగతిపై ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ సమీక్షా సమావేశం నిర్వహించారు. గత రెండేళ్లలో మంజూరు చేసిన పనులలో కొన్ని ఇప్పటికీ పూర్తి కాకపోవడంపై అసంతృ
ఎంపీ లాడ్స్ నిధులతో చేపట్టిన పనుల పురోగతిపై ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ సమీక్షా సమావేశం నిర్వహించారు. గత రెండేళ్లలో మంజూరు చేసిన పనులలో కొన్ని ఇప్పటికీ పూర్తి కాకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎంపీ లాడ్స్ నిధులపై కేంద్ర ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన నోట్ ను ప్రస్తావించిన ఎంపీ, ప్రజాప్రతినిధులు, వివిధ వర్గాల నుంచి వచ్చే విజ్ఞప్తుల మేరకు తాను ఎప్పటికప్పుడు నిధులు కేటాయిస్తూ అనుమతులు ఇస్తున్నానన్నారు. పనులు పూర్తిచేసినప్పటికీ కొన్ని పనులను ఆన్లైన్ లో సబ్మిట్ చేయకపోవడం వల్ల డేటాలో తక్కువగా చూపిస్తోందని అధికారులు ఎంపీకి వివరించారు.గ్రామీణ ప్రాంతాల్లో అనుమతులు ఇచ్చిన ఆర్వో వాటర్ ప్లాంట్స్ పనులను త్వరగా పూర్తి చేయాలని ఎంపీ అధికారులను ఆదేశించారు. నిధులు సరిపోకపోతే అవసరమైతే రాజ్యసభ సభ్యుల నుంచి కొన్ని నిధులను, సిఎస్ఆర్ నిధులను తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తానని, అయితే మంజూరు చేసిన ఏడాదిలోపు పనులు పూర్తిచేసేందుకు విధిగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఎంపీ ఆదేశించారు.