News10th Jan 01:11 PMSunil Byrisetty1 min read

ఎట్టకేలకు అదుపులోకి మంటలు

కోనసీమ జిల్లా ఇరుసుమండలో పరిస్థితులు అదుపులోకి వచ్చాయి. ఓఎన్జీసీ పైప్ లైన్ బ్లోఅవుట్‌ మంటలు ఎట్టకేలకు పూర్తిగా ఆరిపోయాయి.కాలిన శకలాలను ఓఎన్జీసీ విపత్తు నిర్వహణ బృందం పూర్తిగా తొలగి

ఎట్టకేలకు అదుపులోకి మంటలు
కోనసీమ జిల్లా ఇరుసుమండలో పరిస్థితులు అదుపులోకి వచ్చాయి. ఓఎన్జీసీ పైప్ లైన్ బ్లోఅవుట్‌ మంటలు ఎట్టకేలకు పూర్తిగా ఆరిపోయాయి.కాలిన శకలాలను ఓఎన్జీసీ విపత్తు నిర్వహణ బృందం పూర్తిగా తొలగించింది. వాటర్‌ అంబ్రెల్లా ద్వారా శీతలీకరణ పనులు చేపట్టారు. వెల్‌ క్యాపింగ్‌ పనులకు విపత్తు నివారణ బృందం సిద్ధమవుతోంది. బావి వద్ద అమర్చేందుకు బ్లోఅవుట్‌ ప్రివెంటర్‌ను ఓఎన్జీసీ సిద్ధం చేసింది. ఇరుసుమండలోని మోరి-5 డ్రిల్లింగ్‌ సైట్‌లోని బావిలో ఇటీవల మంటలు చెలరేగిన విషయం తెలిసిందే.
Andhra Pradesh
Konaseema
Irsumanda
ONGC
Pipeline Blowout
Fire Under Control
Disaster Management Team
వెల్ క్యాపింగ్
బ్లోఅవుట్ ప్రివెంటర్
మోరి-5 డ్రిల్లింగ్ సైట్
Scroll for the next article