News1st Apr 09:52 AMSunil Byrisetty1 min read

కేసానుపల్లి ఎడ్లు భారీ బండను లాగేశాయి!

రాష్ట్రంలో ప్రఖ్యాతిగాంచిన తెనాలి బండలాగుడు పోటీలు అలరించాయి. భారీ బండలను సైతం ఎడ్లు సునాయాసంగా లాగేశాయి. తెనాలిలో నిర్వహించిన ఎద్దుల బండలాగుడు పోటీల్లో దాచేపల్లి మండలం కేసానుపల్లి

కేసానుపల్లి ఎడ్లు భారీ బండను లాగేశాయి!
రాష్ట్రంలో ప్రఖ్యాతిగాంచిన తెనాలి బండలాగుడు పోటీలు అలరించాయి. భారీ బండలను సైతం ఎడ్లు సునాయాసంగా లాగేశాయి. తెనాలిలో నిర్వహించిన ఎద్దుల బండలాగుడు పోటీల్లో దాచేపల్లి మండలం కేసానుపల్లి ఎడ్ల జత ప్రథమ బహుమతి సాధించింది. నెల్లూరు రామకోటయ్యకు చెందిన ఎడ్ల జత తొలిస్థానంలో నిలిచింది. టీడీపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా, ఉగాదినాడు ఈ ఎద్దుల పోటీలు నిర్వహించారు. ఆరు పళ్ల విభాగంలో 15 నిమిషాల్లో 3980 అడుగులులాగిన ఈ ఎడ్ల జత ప్రథమ బహుమతిని సాధించింది. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ఆలపాటి, ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు ఎడ్ల యజమాని రామకోటయ్యను ప్రత్యేకంగా అభినందించారు.
Ongole breed bull racing
Tenali
తెనాలిలో ఒంగోలు జాతి ఎడ్ల పందేలు
Scroll for the next article